Search
Saturday 22 September 2018
  • :
  • :
Latest News

బాలకృష్ణకు జోడీగా శ్రియా?

Shriyaనందమూరి బాలకృష్ణ 100వ చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ ఇప్పటికే తొలి షెడ్యూల్ షూటింగ్ పూర్తిచేసుకుంది. క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం కోసం మొరాకో వెళ్లిన సినిమా యూనిట్ అక్కడ 8 కోట్ల ఖర్చుతో యుద్ధ సన్నివేశాలను చిత్రీకరించింది. ఇక సోమవారం నుండి హైదరాబాద్‌లోని చిలుకూరి బాలాజీ దేవాలయం సమీపంలో సినిమా రెండో షెడ్యూల్ చిత్రీకరణ ప్రారంభంకానుంది. ఇప్పటివరకు ఎవరూ వేయనంత పెద్ద యుద్ధ నౌక సెట్‌ను వేసి ఆ సెట్‌లో షూటింగ్ చేయనున్నారు. ఈ షెడ్యూల్ కోసం 200 మంది ఆర్టిస్టులకు ఫైట్ మాస్టర్స్ రామ్‌లక్ష్మణ్ ఆధ్వర్యంలో యుద్ధానికి సంబంధించి కత్తిసామును ప్రాక్టీస్ చేయిస్తున్నారు. ఇదిలాఉండగా ఇప్పటివరకు ఈ మూవీలో హీరోయిన్ ఎవరనేది ఫైనల్ కాలేదన్న విషయం తెలిసిందే. ఇప్పుడు బాలకృష్ణ సరసన హీరోయిన్‌గా నటించేందుకు శ్రియాశరణ్‌ను సంప్రదిస్తున్నారని సమాచారం. “ఇది ఒక రాణి పాత్ర. ఈ రోల్‌ని చేసేందుకు చక్కగా నటించే నటీమణి కావాలి. అందుకే అనుభవజ్ఞులైన సీనియర్ హీరోయిన్‌ను తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నాం”అని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. గతంలో చెన్నకేశవరెడ్డి చిత్రంలో బాలయ్యతో కలిసి నటించింది శ్రియాశరణ్. ఇటీవల శ్రియ హీరోయిన్‌గా నటించిన చివరి సినిమా ‘గోపాల గోపాల’. ఈ ఏడాది విడుదలైన ‘ఊపిరి’లోనూ కేమియో రోల్ చేసింది ఈ సీనియర్ భామ. శ్రియాను తీసుకుంటే డేట్స్ సమస్య ఉండదని ప్లాన్ చేసుకున్న ఫిల్మ్‌మేకర్స్ షెడ్యూల్ ప్రకారం మూవీని పూర్తి చేయవచ్చని భావిస్తున్నారు.

Comments

comments