Search
Wednesday 14 November 2018
  • :
  • :

బయోపిక్‌తో తెరంగేట్రం

balaiah

2017లోనే నందమూరి బాలకృష్ణ నట వారసుడు మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశం చేస్తాడని ప్రచారం సాగింది. మోక్షజ్ఞ నటన, డ్యాన్సులు, ఫైట్స్‌లో శిక్షణ తీసుకుంటున్నాడని అన్నారు. అయితే 2018 మధ్యలోకి వచ్చినా అతని ఎంట్రీ గురించి ఇప్పటికీ సరైన క్లారిటీ లేదు. అయితే మోక్షజ్ఞ ఈ ఏడాదిలో తెరంగేట్రం చేస్తాడని తెలిసింది. తాజా సమాచారం ప్రకారం  ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘ఎన్టీఆర్’ బయోపిక్‌లో అతను ఓ కీలక పాత్రలో నటిస్తాడని తెలిసింది. ఇందులో నూనుగు మీసాల ఎన్టీఆర్‌గా మోక్షజ్ఞ కనిపిస్తాడట. నిమ్మకూరులో ఉన్నప్పుడు నందమూరి తారక రామారావు ఎలా ఉండేవారో ఆవిధంగా దర్శనమిస్తాడట. ఈ సినిమా కోసం ప్రస్తుతం సింగపూర్‌లో కొత్త లుక్ కోసం శిక్షణతో పాటు నట శిక్షణ తీసుకుంటున్నాడట మోక్షజ్ఞ.

Comments

comments