Home తాజా వార్తలు క్రిష్ ఆఫీసు ముందు బాలయ్య అభిమానుల ఆందోళన

క్రిష్ ఆఫీసు ముందు బాలయ్య అభిమానుల ఆందోళన

SHATAKARNI

హైదరాబాద్ : దర్శకుడు క్రిష్ ఆఫీసు ఎదుట బాలకృష్ణ అభిమానులు ఆందోళనకు దిగారు. ఈ నెల 11వ తేదీనే శాతకర్ణి సినిమాను విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. శుక్రవారం ఉదయం నిర్ణయం తీసుకుందామని బాలయ్య అభిమానులకు శాతకర్ణి చిత్ర నిర్మాత సాయిబాబు వివరించారు. ఈ నెల 11న చిరంజీవి నటించిన ఖైదీ నం.150 చిత్రం విడుదలవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో శాతకర్ణి సినిమాను ఈనెల 12వ తేదీన విడుదల చేయాలని నిర్ణయించారు. బాలయ్య అభిమానులు మాత్రం 11వ తేదీనే శాతకర్ణిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు.