Search
Wednesday 21 November 2018
  • :
  • :

ఆదిత్య 369 సీక్వెల్‌తో బాలకృష్ణ తనయుడు ఎంట్రీ…

Balakrishna-and-his-son-imaహైదరాబాద్ : తన కుమారుడు మోక్షజ్ఞ ఎంట్రీపై నందమూరి బాలకృష్ణ క్లారిటీచ్చారు.. ఆదిత్య 369 సీక్వెల్ చిత్రంలో తాను, మోక్షజ్ఞ కలిసి నటిస్తామని చెప్పారు. అయితే ఆ చిత్రానికి ఇంకా సమయం ఉందన్నారు. తన వందో చిత్రం కోసం రెండు కథలు సిద్ధమైనట్లు బాలకృష్ణ తెలిపారు. కృష్ణవంశీ దర్శకత్వంలో ‘రైతు’, క్రిష్ దర్శకత్వంలో ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ కథలు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. అయితే వీటిలో ఏది వందో సినిమాగా చేయాలన్న దానిపై అమావాస్య తర్వాత నిర్ణయం తీసుకుంటామన్నారు. లేపాక్షిని ప్రపంచ వారసత్వ కేంద్రంగా గుర్తించాలని యునెస్కోకు ప్రతిపాదనలు పంపినట్లు బాలకృష్ణ తెలిపారు.

Comments

comments