Home తాజా వార్తలు బాలాపూర్ గణపతి నిమజ్జనం పూర్తి!

బాలాపూర్ గణపతి నిమజ్జనం పూర్తి!

Balapur-Ganesh

హైదరాబాద్ : నగరంలో గణనాథుల నిమజ్జనం కార్యక్రమం ప్రశాంతంగా కొనసాగుతోంది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన గణపతుల విగ్రహాలు ఒకొక్కటిగా గంగమ్మ ఒడికి చేరుకుంటున్నాయి. ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేసి క్రేన్ నెం.8 వద్ద బాలాపూర్ గణపతి నిమజ్జనం జరిగింది. ఉదయం నుంచి వైభవంగా ప్రారంభమైన బాలాపూర్ గణనాథుడి శోభాయాత్ర సాయంత్రం 6 గంటల ప్రాంతంలో నిమజ్జనం కావడంతో ముగిసింది. అంతకుముందు నిర్వహించిన వేలం పాటలో బాలాపూర్‌ లడ్డూను రూ.15.60 లక్షలకు జూబ్లీహిల్స్‌కు చెందిన నాగం తిరుపతిరెడ్డి దక్కించుకున్న విషయం తెలిసిందే.