Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

ప్రత్యూష ఆత్మహత్యకు ప్రియుడే కారణమా..?

pratyusha-banerjee-image-doముంబయి : ‘చిన్నారి పెళ్లికూతురు’ సీరియల్‌తో ప్రేక్షకులకు సుపరిచితురాలైన నటి ప్రత్యూష బెనర్జీ(24) పోస్టుమార్టం రిపోర్టు బహిర్గతమయింది. ఆత్మహత్యేనని పోస్టుమార్టంలో వెల్లడైంది. ఊపిరి ఆడని స్థితిలో ఉక్కిరిబిక్కిరై ఆమె మరణించినట్లు వైద్యులు తమ నివేదికలో పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం ప్రత్యూష తన సొంత ఫ్లాట్లోనే ఉరివేసుకెని ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. కాగా ప్రియుడు రాహుల్ రాజ్‌తో వున్న అనుబంధం దెబ్బతినడం వల్లే ఆమె ఆత్మహత్య చేసుకొని ఉంటుందని, ఆమె మృతికి ప్రియుడు రాహులే కారణమని పలు కథనాలు వినిపిస్తున్నాయి. ముంబయి పోలీసులు రాహుల్‌ని రహస్య ప్రదేశంలో విచారిస్తున్నారు. తమ కుమార్తె ప్రేమ వ్యవహారం తమకు తెలుసని, ఆమె మృతి విషయమై రాహుల్ తప్పక సమాధానం చెప్పాల్సి ఉందని ప్రత్యూష తల్లి వాపోతున్నారు. ఆమె కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది. పరోపక్క ప్రియుడు రాహుల్ తీరుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రత్యూషను ఆస్పత్రికి తీసికెళ్లాక..ఆమె మృతి చెందిందని నిర్థారణ అయిన తర్వాత రాహుల్ ఆమె ఫోన్ తీసుకుని అక్కడి నుంచి మెల్లగా జారుకున్నాడని చెబుతున్నారు. అలాగే శుక్రవారం ఇరువురు ఓ మాల్‌లో గొడవ పడ్డారని, ఆ సమయంలో రాహుల్ ప్రత్యూషపై చేయి చేసుకున్నాడని..ఇది జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే ఆమె విగత జీవిగా మారిందని వార్తలు వినిపిస్తున్నాయి. నిజానిజాలు ఎలా ఉన్నప్పటికీ చిన్న వయసులో ప్రత్యూష ఈ పరిస్థితుల్లో మరణానికి చేరవవడం కలచివేసింది. ప్రేమ కారణంగా అర్థాంతరంగా తనువు చాలించిన తారలను గుర్తుచేసింది. వెలుగు జిలుగుల జీవితాలను చీకటిగా మార్చేసిన ‘ప్రేమ’ మరోసారి వార్తల్లోకెక్కింది. మరోవైపు అశ్రు నయనాల మధ్య ప్రత్యుష కుటుంబ సభ్యులు ఆమెకు అంతక్రియలు నిర్వహించారు.

Comments

comments