Home నాగర్ కర్నూల్ నిరుపయోగంగా ఉన్న బల్మూర్ ఆర్టీసి బస్టాండు

నిరుపయోగంగా ఉన్న బల్మూర్ ఆర్టీసి బస్టాండు

Balmur bus stand Not useful to people

బల్మూర్: ప్రయాణికుల సౌకరార్థం కోసం ప్రభుత్వం లక్షలు వెచ్చించి బస్టాండు నిర్మాణం చేశారు. అధికారుల నిర్లక్షం వల్ల అధి ప్రయాణికులకు శాపంగా మారి నేడు నిరుపయోగంగా దర్శనమిస్తున్నా బల్మూర్ ఆర్టీసి బస్టాండ్ పరిస్థితి ఆగమ్య గోచరంగా మారింది. మండల కేంద్రమైన బల్మూర్‌లో దాదాపు 15సంవత్సరాల క్రితం బస్టాండు నిర్మాణం చేశారు. ప్రభుత్వం లక్షల రూపాయలు వెచ్చించి ప్రయాణికుల సౌకర్యార్థం కోసంబస్టాండు నిర్మాణం చేస్తే నేడు నిరుపయోగంగా మారింది. ఆర్టీసి అధికారులు బస్టాండు వద్ద బస్సులను నిలుపుదల చేయకపోవడంతో ప్రయాణికులు బస్టాండు వద్దకు వచ్చిన దాఖలాలు లేవు. మొదట్లో ఒక వారం రోజులు మాత్రమే బస్సులను బస్టాండు వద్ద నిలుపుదల చేసి మొక్కుబడిగా ప్రారంభించడం జరిగింది. అప్పటినుంచి ఇప్పటి వరకు కూడా బస్టాండు వద్ద ఇటు లింగాల నుంచి అటు అచ్చంపేట నుంచి వచ్చే బస్సులను బస్టాండు వద్ద ఆపక పోవడం చాలా దురదృష్టకరం దీనితో ప్రయాణికులు ఎవ్వరు కూడా బస్టాండు దగ్గరికి రావడం లేదు. నిర్మాణం చేసిన బస్టాండు ఇతరులకు ఆవాసంగా వేదికగా, మారింది. ప్రస్తుతం బస్సులు ఆగుతున్న ప్రదేశంలో బస్టాండుగాని, మిని బస్టాండుగాని, నీడ కూడా లేకుండా మండుటెండల్లో వర్షాకాలంలో వర్షానికి ప్రయాణికులు తల దాచుకుని బస్సుల కోసం వేచిచూస్తుంటారు. సంబంధిత ఆర్టీసి అధికారులు నిర్లక్షం వల్ల నిర్మాణం చేసిన బస్టాండు వద్ద బస్సులు ఆగకపోవడం ప్రయాణికులకు కూడా బస్టాండు వద్దకు రాకపోవడంతో చాలా సంవత్సరాల నుంచి బస్టాండు ఇతరుల అవసరాల కోసం ఉపయోగ పడుతుంది. సీజన్‌లో కొంతమంది రైతులు ఆబస్టాండు ఆవరణలో మొక్కజొన్న ఇతర పంటలను అక్కడ నిలువ చేసుకుంటున్నారు. ఇప్పటికైనా ఆర్టీసి అధికారులు చొరవ తీసుకుని బల్మూర్ బస్టాండ్‌ను ఉపయోగం లోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్థానికులు కోరుతున్నారు.