Home జాతీయ వార్తలు లోక్‌సభ మాజీ స్పీకర్ బలరామ్ జక్కర్ కన్నుమూత

లోక్‌సభ మాజీ స్పీకర్ బలరామ్ జక్కర్ కన్నుమూత

JAKKARఢిల్లీ : కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ మాజీ స్పీకర్ బలరామ్ జక్కర్(92) బుధవారం ఉదయం చనిపోయారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆయన ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. జక్కర్ భౌతికకాయాన్ని పంజాబ్‌లోని ఆయన స్వగ్రామానికి తరలించనున్నట్టు కాంగ్రెస్ నేతలు తెలిపారు. బలరామ్ జక్కర్ మృతిపై ప్రధాని మోడీ, కాంగ్రెస్ సుప్రీం సోనియా, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ తదితరులు సంతాపం తెలిపారు.