Home జాతీయ వార్తలు రేపటి నుంచి ఢిల్లీలో పెట్రోల్, డీజిల్ ట్యాక్సీలపై నిషేధం

రేపటి నుంచి ఢిల్లీలో పెట్రోల్, డీజిల్ ట్యాక్సీలపై నిషేధం

Taxisన్యూ ఢిల్లీ: దేశ రాజధాని న్యూ ఢిల్లీలో కోర్టు ఆదేశాల మేరకు ఆదివారం నుంచి పెట్రోల్, డీజిల్ ట్యాక్సీలపై నిషేధం అమలు కానుంది. పెట్రోల్, డిజీల్‌లతో నడిచే వాహనాలపై సుప్రీం కోర్టు నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆల్ ఇండియా పర్మిట్ ఉన్న ట్యాక్సీలకు సిఎన్‌జి టెక్నాలజీతో మార్చుకోవడానికి అనుమతించింది. ప్రస్తుత మార్కెట్లో సిఎన్‌జి టెక్నాలజీ సరియైనంతగా అందుబాటులో లేనందున నిషేధం గడువును మరికొంత కాలం పొడిగించాలనే ట్యాక్సీ ఓనర్ల సంఘం చేసిన విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది. ఇప్పటికే పలు దఫాలలో అవసరమైన సమయం ఇచ్చామని, మరోసారి గడువు ఇచ్చే ప్రసక్తేలేదని వెల్లడించింది.