Home జాతీయ వార్తలు బిహెచ్‌యు క్యాంపస్‌లో విద్యార్థి దారుణ హత్య!

బిహెచ్‌యు క్యాంపస్‌లో విద్యార్థి దారుణ హత్య!

Banaras Hindu Universityవారణాసిలో: వారణాసిలోని బెనారస్ హిందూ యూనివర్శిటీలో ఓ విద్యార్థిని కొందరు దుండగులు అందరూ చూస్తుండగానే అతి దారుణంగా తుపాకీతో కాల్చి చంపారు. యూనివర్శిటీ క్యాంపస్‌లో మంగళవారం సాయంత్రం ఈ దారుణ సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. గౌరవ్ సింగ్ బెనారస్ హిందూ యూనివర్శిటీలో మాస్టర్స్ చదువుతున్నాడు. యూనివర్శిటీ క్యాంపస్ లోని లాల్ బహదూర్ శాస్త్రి హోటల్ లో ఉంటూ రోజూ యూనివర్శిటీకి వెళ్లేవాడు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం గౌరవ్ హాస్టల్ ముందు నిల్చొని తన స్నేహితులతో మాట్లాడుతున్న సమయంలో ద్విచక్రవాహనంపై వచ్చిన కొందరు దుండగులు ఒక్కసారిగా తుపాకీతో గౌరవ్ పై కాల్పులకు తెగబడ్డారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన గౌరవ్ ని అతడి మిత్రులు హుటాహుటిన చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే గౌరవ్ చనిపోయినట్లు వైద్యులు చెప్పారు. ఈ ఘటనపై గౌరవ్ స్నేహితుల సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని అక్కడి సిసిటివి ఫుటేజీలో రికార్డైన దృశ్యాల ఆధారంగా దర్యాప్తు  చేపట్టారు. రంగంలోకి దిగిన పోలీసులు ఇప్పటికే నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

Banaras Hindu University Student Shot Dead On Campus