Search
Friday 21 September 2018
  • :
  • :
Latest News

కాంగ్రెస్‌పై దత్తాత్రేయ మండిపాటు

Bandaru_dattatreya

హైదరాబాద్ : జిఎస్‌టి విషయంలో కాంగ్రెస్ అనుసరిస్తున్న విధానంపై కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ మండిపడ్డారు. 17 రకాల పన్నుల స్థానంలో జిఎస్‌టి అనే ఏకీకృత పన్నుల వ్యవస్థను కేంద్రం తీసుకొచ్చిందని ఆయన పేర్కొన్నారు. అస్తవ్యస్తమైన పన్నుల విధానాన్ని ప్రధాని మోడీ మొదటిసారిగా సంస్కరించారని ఆయన కొనియాడారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. జిఎస్‌టి ప్రారంభ వేడుకులకు కాంగ్రెస్ గైర్హాజరు కావడాన్ని ఆయన తప్పుబట్టారు. దేశ ప్రజలందరిదీ ఒక దారి అయితే, కాంగ్రెస్, వామపక్షాలది ఎడారి దారి అని ఆయన మండిపడ్డారు. జిఎస్‌టితో ఎపి, తెలంగాణ రాష్ట్రాలకు అత్యధిక ప్రయోజనం చేకూరుతుందని ఆయన స్పష్టం చేశారు.

Bandaru Dattatreya Comments on Congress

Comments

comments