Home తాజా వార్తలు గవర్నర్‌గా వెళ్లను : దత్తాత్రేయ

గవర్నర్‌గా వెళ్లను : దత్తాత్రేయ

Bandaru-Dattatreya

హైదరాబాద్ : తాను గవర్నర్‌గా వెళ్లనని మాజీ కేంద్రమంత్రి , సికింద్రాబాద్ ఎంపి బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో బిజెపి బలోపేతమవుతుందని ఆయన తెలిపారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలోని అన్ని స్థానాలకు పోటీ చేస్తామని ఆయన చెప్పారు. తెలంగాణలో టిఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం బిజెపి మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. 2019 ఎన్నికల్లో పోటీ చేస్తానని ఎంపీ బండారు దత్తాత్రేయ అన్నారు. నాగం పార్టీ మారే విషయంలో తాను స్పందించబోనని తెలిపారు. ప్రధానిపై తెలంగాణ సిఎం కెసిఆర్ విమర్శలు చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. మోడీని విమర్శించే స్థాయి కెసిఆర్‌కు లేదని ఆయన మండిపడ్డారు. తెలంగాణలో మిషన్ భగీరథకు కేంద్రం రూ.3,900 కోట్లు కేటాయించిందన్నారు. రాష్ట్రంలో సాగు నీటి ప్రాజెక్టుల కోసం కేంద్రం సాయం చేస్తుందని ఆయన చెప్పారు.

Bandaru Dattatreya Comments on Projects