న్యూఢిల్లీ : కేంద్ర మంత్రి పదవికి తెలంగాణకు ప్రాతినిధ్యం వహిస్తోన్న ఏకైక నాయకుడు బండారు దత్తాత్రేయ శుక్రవారం తన పదవికి రాజీనామా చేస్తున్నారు. ఆదివారం ఉదయం కేంద్ర మంత్రివర్గ విస్తరణ జరుగనున్న విషయం తెలిసందే. ఈ నేపథ్యంలో ఐదుగురు పాత కేంద్ర మంత్రులు తమ పదవులకు రాజీనామా చేశారు. వారిలో రాజీవ్ ప్రతాప్ రూడీ, ఉమాభారతి, కల్రాజ్ మిశ్రా, నిర్మలా సీతారామన్, సంజీవ్ బలియాన్, మహేంద్ర పాండేలు ఉన్నారు. ముందుగా అనుకున్న జాబితాలో కార్మిక, ఉపాధికల్పన శాఖ సహాయమంత్రి దత్తాత్రేయ పేరు ఎక్కడా వినిపించనప్పటికీ రాత్రిరాత్రే ఆయన చేత రాజీనామా చేయించడం అందరినీ విస్మయానికి గురిచేసింది.