Home జిల్లాలు బంద్ సక్సెస్

బంద్ సక్సెస్

bus* విజయవంతమైన తాలుకా బంద్
* రోడ్డెక్కని ఆర్‌టిసి * బంద్‌కు సకలం సహకారం

వెల్దండ: కల్వకుర్తి పట్ణణ కేంద్రాన్ని రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తు ఆదివారం నిర్వహించిన కల్వకుర్తి తాలుకా బంద్ వెల్దండ మండలంలో విజయవంతమైంది.ఆదివారం ఉదయం నుంచి మండల కేంద్రంలోని వ్యాపార,వాణిజ్య సంస్థలు,హోటళ్లతో పాటు అన్ని దుకాణాలు స్వచ్చందంగా బంద్‌ను పాటించారు.బంద్ సందర్భంగా అఖిలపక్ష నాయకుల అధ్వర్యంలో మండల కేంద్రంలోని హైద్రాబాద్,శ్రీశైలం ప్రధాన రహాదారిపై రాస్తారోకో,ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో అఖిలపక్షం నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.