Search
Wednesday 21 November 2018
  • :
  • :
Latest News

కాంగ్రెస్‌లో చేరిన బండ్ల గణేశ్

Bandla Ganesh joining in the Congress

ఢిల్లీ : ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేశ్ శుక్రవారం కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్ సుప్రీం రాహుల్‌గాంధీ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అదేవిధంగా టిఆర్‌ఎస్ ఎంఎల్‌సి భూపతిరెడ్డి, పలు పార్టీలకు చెందిన నేతలు కాంగ్రెస్‌లో చేరారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజగోపాల్‌రెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండ్ల గణేశ్ మాట్లాడారు. తనకు కాంగ్రెస్ అంటే ఎంతో ఇష్టమని, అందుకే ఆ పార్టీలో చేరినట్టు ఆయన తెలిపారు. రాహుల్‌గాంధీ తనను పోటీ చేయమని ఆదేశిస్తే, వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని ఆయన తెలిపారు.

Comments

comments