Search
Saturday 22 September 2018
  • :
  • :
Latest News

రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతుంది :బంగారు లక్ష్మణ్

Bangaru Laxman Speech Against TRS In Dubbaka Meeting

దుబ్బాకః రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతుందని భారతీయ జనతా పార్టి రాష్ట్ర అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్, రాజ్యసభ సభ్యులు జివిఎన్ నర్సింహరావు లు అన్నారు. శనివారం రోజున భారతీయ జనతాపార్టి ఆధ్వర్యంలో చేపట్టిన మార్పు కోసం ప్రజా చైతన్య యాత్ర దుబ్బాకకు చేరింది. ముందుగా రాష్ట్ర అధికార ప్రతినిధి ఎం రఘునందన్‌రావు నేతృత్వంలో మండలంలోని తిమ్మాపూర్ గ్రామం వద్ద వారికి ఘన స్వాగతం పలికి అక్కడి నుండి మోటర్‌ బైక్ ర్యాలి నిర్వహిస్తు ధర్మారం, హబ్షీపూర్ గ్రామాల మీదుగా దుబ్బాకకు చేరుకున్నారు. గ్రామ సరిహద్దు నుండే మహిళలు, కార్యకర్తలు భారీగా చేరుకుని బతుకమ్మ, బోనాల తో ఊరేగింపుగా సభ స్దలికి తరళి వెళ్ళారు. ఈ సందర్బంగా స్దానిక పోచమ్మ ఆలయం వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వారు ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడారు. పుష్పగుచ్చాలు, శాలువాలతో వారికి నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ విషయమై వారు మాట్లాడుతూ.. కేంద్రంలో భాజపా ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న సంక్షేమ పధకాలు ప్రతి ఒక్కరికి చేరేలా కృషి చేయడం జర్గుతుందన్నారు. రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ నిధులతోనే అభివృద్ది జరుగుతుందన్నారు. అవేమి చెప్పకుండ టిఆర్‌ఎస్ ప్రజలను మభ్యపెడుతుందని వారు ఆరోపించారు. రైతుల ఆత్మహత్యలపై స్పందించని ప్రభుత్వం నేడు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రైతుల మభ్యపెట్టె కార్యక్రమాలను చెపడుతుందని వారు విమర్షించారు. ఈ కార్యక్రమంలో భాజపా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Comments

comments