Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

అయోమయంతోనే ప్రమాదం

PLANE

 రన్‌వే దారి తప్పి ఫుట్‌బాల్ గ్రౌండ్‌లో కూలిన బంగ్లాదేశ్ విమానం

 నేపాల్ అధికారుల వెల్లడి

ఖాట్మండు: నేపాల్‌లోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కూలిన బంగ్లాదేశ్ విమానం బ్లాక్ బాక్స్‌ను నేపాల్ పరిశోధకులు స్వాధీనం చేసుకున్నారు. ప్రమాదానికి ముందు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్, పైలట్ మధ్య జరిగిన సంభాషణ ఆధారంగా రన్‌వేపై ఏర్పడిన అయోమయం కారణంగానే విమానం కూలి ఉంటుందన్న అభిప్రాయాన్ని అధికారులు వ్యక్తం చేశారు. ప్రమాదానికి గురైన విమానంలో నలుగురు సిబ్బంది సహా 67 మంది ప్రయాణికులు ఉన్నారు. వారి లో 49 మంది చనిపోయారని అధికారులు చెప్పా రు. ఆ విమానం రన్‌వే దారి తప్పి ఫుట్‌బాల్ గ్రౌం డ్‌లో కుప్పకూలింది. ‘విమానం డేటా రికార్డు స్వాధీనం చేసుకున్నాం. దాన్ని మేము భద్రపరిచాం’ అని విమానాశ్రయం జనరల్ మేనేజర్ రాజ్‌కుమార్ చెత్రీ చెప్పారు. విమానం కూలిన ఘటనపై దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు కూడా తెలిపారు. ప్రమాదానికి గురైన విమానంలో 33 మంది నేపాలీలు, 32 మంది బంగ్లాదేశీయులు, చైనా, మాల్దీవులకు చెందిన చెరొకరు ప్రయాణించారు. కెనడా విమాన తయారీ సంస్థ బాంబార్డియర్ ఘటనా స్థలికి విమాన భద్రత పరిశోధకుడిని, అలాగే ఫీల్డ్ సర్వీస్ ప్రతినిధిని పంపుతున్నట్లు తెలిపింది. నేపాల్ ప్రభుత్వం దర్యాప్తుకు ఆరుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. బంగ్లాదేశ్ పౌర విమానయాన శాఖ, పర్యాటక శాఖ మంత్రి ఎం.కె. ఎం. షాజహాన్ కమల్ నేతృత్వంలో ఉన్నత స్థాయి బృందం మంగళవారం ఖాట్మాండు చేరుకుంటుందని సమాచారం. పైలట్‌కు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్‌కు మధ్య జరిగిన చివరి నాలుగు నిమిషాల సంభాషణలో రన్‌వే 02, రన్‌వే 20కి మధ్య పైలట్‌లో అయోమయం ఏర్పడిందని నేపాలీ టైమ్స్ దినపత్రిక  పేర్కొంది. ఇటీవల కాలంలో నేపాల్‌లో అనేక విమాన ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. సోమవారం జరిగిన విమాన ప్రమాదం 1992లో జరిగిన ప్రమాదం తర్వాత జరిగిన ఘోర ప్రమాదం. నాడు 167 మంది చనిపోగా. తాజా విమాన ప్రమాదంలో 49 మంది చనిపోయారు.

Comments

comments