Home తాజా వార్తలు బంగ్లాదేశ్ టాప్ మహిళా క్రికెటర్ అరెస్టు!

బంగ్లాదేశ్ టాప్ మహిళా క్రికెటర్ అరెస్టు!

Bangladesh Woman Cricketer arrested for Drug Trafficking

ఢాకా: బంగ్లాదేశ్‌కు చెందిన టాప్ మహిళా క్రికెటర్ నజ్రీన్ ఖాన్ ముక్తా 14వేల మెటామెఫ్టామైన్ మాత్రలతో పట్టుబడింది. దీంతో ఆమెపై బంగ్లా పోలీసులు మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కేసు నమోదు చేశారు. ఢాకా ప్రీమియర్ లీగ్‌లో ఆడుతున్న నజ్రీన్ మ్యాచ్ ముగిసిన అనంతరం తిరిగి వెళ్తున్న సమయంలో చిట్టగాంగ్ వద్ద తనిఖీలు నిర్వహించిన పోలీసులకు ఆమె మాత్రలతో పట్టుబడింది. ఈ మాత్రలలో మాదకద్రవ్యమైన కెఫిన్ ఉంటుందని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. దీంతో నజ్రీన్‌పై మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కేసు నమోదు చేస్తున్నట్టు వెల్లడించారు. ఈ కేసులో నేరం కనుక రుజువైతే నజ్రీన్‌కు జీవిత ఖైదు తప్పదని పలువురు న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు.