Search
Wednesday 26 September 2018
  • :
  • :

టీమిండియాపై బంగ్లాదేశ్ విజయం

Bangladesh Women won by 7 wickets against India Women

కౌలాలంపూర్: మలేషియాలో జరుగుతున్న మహిళల ఆసియా కప్ టీ20లో భారత మహిళా జట్టు వరుస విజయాలకు పసికూన బంగ్లాదేశ్ బ్రేక్ వేసింది. టోర్నీలో భాగంగా బుధవారం బంగ్లాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఓటమి పాలైంది. భారత్ విధించిన 142 పరుగుల లక్ష్యాన్ని బంగ్లాదేశ్ కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. మొదట టాస్‌ గెలిచి  బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 141 పరుగులు చేసింది. భారత ఇన్నింగ్స్‌లో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(42), దీప్తి శర్మ(32) మాత్రమే రాణించారు. మిగతవారు తక్కువ స్కోర్లకే వెనుదిరిగారు. దీంతో టీమిండియా కేవలం 141 పరుగులకే పరిమితమైంది. అనంతరం 142 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన బంగ్లా మరో రెండు బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని అందుకుంది. బంగ్లా ఇన్నింగ్స్‌లో షమీమా సుల్తానా(33), ఫర్గానా(52 నాటౌట్), రుమానా అహ్మద్(42 నాటౌట్) రాణించి బంగ్లాకు ఘన విజయాన్ని అందించారు. భారత్ బౌలర్లలో పూజా వస్ర్తాకర్, రాజేశ్వరీ గైక్వాడ్, పూనమ్ యాదవ్ తలో వికెట్ పడగొట్టారు. ఇక తొలి మ్యాచ్‌లో ఆతిథ్య మలేషియాను ఓడించిన టీమిండియా, రెండో మ్యాచ్‌లో థాయ్‌లాండ్‌ను మట్టికరిపించిన సంగతి తెలిసిందే.

Comments

comments