Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

ఇటుక బట్టీల కార్మికులకు బ్యాంకు ఖాతా

జిల్లా కలెక్టర్ ఎం.వి.రెడ్డి

KSR

మన తెలంగాణ/మేడ్చల్ జిల్లా : ఇటుక బట్టీలలో పనిచేస్తున్న వలస కార్మికులకు బ్యాంకు ఖాతా తెరిచే విధంగా యజమానులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఎం.వి.రెడ్డి అన్నారు. మంగళవారం కీసరలోని కలెక్టరేట్‌లో జిల్లాలోని ఇటుక బట్టీల కార్మి కులు, కార్మిక శాఖ అధికారులతో సమావేశం నిర్విహించారు. ఇటుక బట్టీల కార్మికులకు చెల్లిస్తున్న రోజువారి కూలీ, వారి లావాదేవీలు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్మి కుల సౌకర్యార్ధం ఎప్పటి కప్పుడు వైద్య శిభిరాలను, వారి పిల్లల కోసం పాఠశాలలను నిర్వహించాలని వైద్య, విద్యాశాఖ అధికారు లను ఆదేశించారు. ఈసందర్భంగా కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ రవీందర్‌రెడ్డి, డీఈఓ ఉషారాణి, డీఎంఎన్‌ఎచ్‌ఓ బానుప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
హరతహారంపై సిఎస్ వీడియో కాన్ఫరెన్స్ …
హరితహరంలో మొక్కలు నాటే నిమిత్తం ప్రణాళిక బద్దంగా అటవి శాఖ నర్సరీలలో వివిధ రకాల మొక్కల పెంపకాన్ని చేపడుతు న్నట్లు కలెక్టర్ ఎం.వి.రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ప్రదీప్‌చంద్రతో అన్నారు. మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్య దర్శి ప్రదీప్‌చంద్ర, స్పెషల్ చీప్ సెక్రటరీ బిఆర్ మీనా హరితహరంపై జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో హరితహరంలో భాగంగా మొక్కలు నాటే నిమిత్తం శాఖల వారిగా వివరాలు సేకరించినట్లు తెలిపారు. ఇది వరకు జిల్లాలో నాటిన మొక్కల సంరక్షణ చర్యలపై ఎప్పటి కప్పుడు అధికారులతో సమీక్షిస్తున్నట్లు వివరించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా అటవి శాఖ అధికారి కృష్ణ, డిఆర్‌డిఓ పిడి ఉమాదేవి, డీపీఓ సురేష్ మోహన్, జిల్లా ప్రణాళిక అధికారి సంధ్య పాల్గొన్నారు.

Comments

comments