Search
Wednesday 14 November 2018
  • :
  • :

క్యాష్‌లెస్ విధానంలో బ్యాంకర్లదే కీలక పాత్ర

Collector

సిరిసిల్ల : విధా నంలో కీలక పాత్ర బ్యాంకర్లదేనని జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్ వెల్లడించారు. శనివారం సా యంత్రం సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పొదుపు భవన్‌లో క్యాష్‌లెస్ లావా దేవీలు, బ్యాంకు ఖాతాలు వంటి అంశాలపై బ్యాంక ర్లు, ఎంపిడి వోలు, బ్యాంకు మిత్ర, ఐకెపి సిబ్బంది తో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ, మండల, గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకు ఖాతాలు తెరిచేలా ప్రజ లకు అవగాహన కల్పించాలని, క్యాష్‌లెస్ విధానంలో లావాదేవీలు నిర్వహించేలా చర్యలు చేపట్టాలని సూచిం చారు.

క్యాష్‌లెస్ విధానం అత్యంత ముఖ్యమై నదని కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు గుర్తించాయని సూ చించారు. బ్యాంకర్లు చేసే పనులకు జిల్లా యంత్రాం గం సహకరి స్తుందని, యాప్‌ల ద్వారా లావాదేవీలు నిర్వ హించేలా బ్యాంకర్లు, అధికారులు చర్యలు తీసు కోవాలని తెలిపారు. జెసి షేక్ యాస్మిన్ భాషా మాట్లాడుతూ బ్యాంకర్ల వల్లనే సమస్యలు వస్తున్నాయని, బ్యాంకర్లు మరింత సహకరిం చాలని, బ్యాం కులు వారి ఏరియాలోని గ్రామా లను దత్తత తీసుకుని క్యాష్‌లెస్ విధానంపై ప్రజలకు అవగాహన కల్పించా లని అన్నారు. డిఆర్‌ఒ శ్యాంప్రసాద్ లాల్ మాట్లాడుతూ ఆర్‌బిఐ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు క్యాష్‌లెస్ విధానంపై సర్కులర్‌లు ఇచ్చాయని, ఈ నెల 26కు ముందే కొన్ని గ్రామాలనైనా క్యాష్‌లెస్ గ్రామాలుగా ప్రకటించాలని అన్నారు. ఈ సమా వేశంలో డిఆర్‌డి వో హన్మంతరావు, అదనపు డిఆర్‌డివో మదన్, వివిధ బ్యాంకర్లు, అధికా రులు పాల్గొన్నారు.

Comments

comments