Home ఆదిలాబాద్ ఖరీఫ్ కు కష్టకాలం

ఖరీఫ్ కు కష్టకాలం

Bank loans are very difficult

సహకరించని ప్రకృతి
నకిలీ విత్తనాలతో అన్నదాత బెంబేలు
బ్యాంకు రుణాలు అందక తీవ్ర ఇబ్బందులు

మన తెలంగాణ/ఆదిలాబాద్ బ్యూరో : మళ్లీ ఖరీఫ్ సీజన్‌కు కష్టకాలం వచ్చింది. ప్రతి ఏడు మాదిరిగానే ఈ సారికూడా ఖరీఫ్ సీజన్ రైతును తీవ్ర ఇబ్బందుల పాలుచేస్తుంది. ఓ వైపు ప్రకృతి కటిన్యం మరోవైపు యంత్రాంగం వైఫల్యంతో అన్నదాత మొదటి నుండి అవస్థల పాలవుతూ ఖరీఫ్‌పై క్రమంగా ఆశలు వదులుకుంటున్నాడు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రతి ఏటా ఖరీఫ్‌లో పత్తితో పాటు సోయాబిన్, వరి, మొక్కజొన్న, పసుపు తదితర పంటలు పెద్ద ఎత్తున సాగవుతుంటాయి.
జిల్లాలో నల్లరేగడి భూములు, సారవంతమైందన ఎర్ర నెలలు ఉండడంతో ఈ పంటలకు ఎంతో అనుకులంగా ఉంటుంది. అయితే సరైన సమయంలో సహకరించాల్సిన పకృతి అన్నదాతపై కన్నెర్ర చేస్తుండడం శాపంగా పరిణమిస్తుంది. నైరుతి రుతుపవనాలు అనుకూలించకపోతుండడం సమస్యను మరింత జఠిలం చేస్తుంది. వర్షాలు కురియాల్సిన సమయంలో మండుటెండలు తీవ్ర ప్రభావం చూపుతుండడం, అలాగే ఒ చోట వర్షాలు కురియడం మరో చోట ఎండ కయడంకు తోడు వేసవిని తలపించే రితీలో ఉక్కపోత కొనసాగుతుండడంతో పంటలకు ఆదిలోనే తీవ్ర అడ్డంకులు ఎదురవుతున్నాయి. భూమిలో విత్తనాలు వేసి రోజులు గడుస్తున్నప్పటికీ వర్షాలు కురియకపోతుండడంతో చాలా చోట్ల విత్తనాలు ఎండిపోతున్నాయి. ఇలా ప్రకృతి పరిహసం ముందు ఇగదుడుపవుతున్న అన్నదాతను యంత్రాంగం మరింత కుంగదిస్తుంది. ముఖ్యంగా ఈ సారి ఉమ్మడి జిల్లా అంతా నకిలీ విత్తనాలు పెత్త ఎత్తున అక్రమ పద్దతిలో దిగుమతి అయ్యాయి. బీజీ 3 పత్తి విత్తనాలు నాటిన చాలా మంది రైతులు మొలకలు రాక ఆందోళనకు గురవుతున్నారు. మరో రెండు మూడు రోజుల్లో మొలకలు రానట్లైతే పంట చేజారినట్లేనని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నకిలీ సోయా విత్తనాలు అన్నదాతను నట్టెటా ముంచేస్తున్నాయి. నకిలీ విత్తనాలు నాటిన అన్ని ప్రాంతాల్లో సోయా పంట పూర్తిగా నష్టాల పాలయ్యే ప్రమాదం ఉంది. నకిలీ సోయా విత్తనాలపై ఇప్పటికే రైతులు చోట్ల ఆందోళనలకు దిగుతున్న సంగతి తెలిసిందే. భైంసా ప్రాంతంలో గత కొద్ది రోజుల నుండి రైతాంగం నకిలీ విత్తనాలపై విచారణ జరపలంటూ ఆందోళనలు చేస్తున్నప్పటికి ఆ దిశగా స్పందన కరువైంది. ఈ వ్యవహరం ఇలా సాగుతుండగానే పంట పెట్టుబడుల కోసం రుణాలు అందిచాల్సిన బ్యాంకులు ఇప్పటి వరకు అన్నదాతపై కరుణ చూపడం లేదు. ప్రతి ఏటా మే మాసంలోనే బ్యాంకుల వార్షిక రుణ ప్రణాళిక ఖరారు కావాల్సినప్పటికి ఈ సారి మాత్రం 40 రోజులు అలస్యంగా ప్రణాళికను ఖరారు చేశారు. ప్రణాళిక అలస్యం అయినందున బ్యాంకులకు రుణాల లక్ష్యాలు కేటాయింపబడలేదు. దీంతో ఏ ఒక్క బ్యాంకు కూడా రైతుకు పంట రుణాలు అందివ్వలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపద్యంలో సర్కారు ఒత్తిడి మేరకు స్టేట్ బ్యాంకర్స్ లెవల్ కమిటీ వార్షిక రుణ ప్రణాళికను ఖరారు చేసినప్పటికిని స్థానికంగా ఉన్న వాణిజ్య బ్యాంకులు మాత్రం రైతులకు రుణాలు అందివ్వడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. గత రుణ మాఫీ వ్యవహరంతో మొదటి నుంచి బ్యాంకులు పంట రుణాల విషయంలో సుముఖంగా లెవన్న వాదనాలు ఉన్నాయి. ప్రస్తుతం మెలికలు సృష్టిస్తూ బ్యాంకులు రుణాల విషయంలో అన్నదాతను ఇబ్బందుల పాలు చేస్తున్నాయంటున్నారు. డిజిటల్ పట్టదార్ పాస్ పుస్తకంతో పాటు పహానీ పత్రం కావాలని నిబంధనాలు పెడుతూ రైతులను ఇబ్బందుల పాలు చేస్తున్నారనే ఫిర్యాదులు ఉన్నాయి. ధరణి ప్రక్రియ కారణంగా మీ సేవా కేంద్రాల నుండి పహానీ జారీ నిలిచిపోయింది. కనీసం మన్యూవల్ పహానీ కపిలనైన తీసుకురావాలని బ్యాంక్ అధికారులు తిరకసు పెడుతున్నట్లు చెబుతున్నారు. తహసీల్దార్లు మన్యువల్ పహానీ కపిలు ఇచ్చేందుకు నిరకరిస్తుండడం రైతులను ఇక్కట్లకు గురి చేస్తుంది. మొత్తనికి ఖరీఫ్ సీజన్ అన్నదాతను ఆరిగోసకు గురి చేస్తుందని చెబుతున్నారు.