Search
Sunday 23 September 2018
  • :
  • :

సరికొత్త శిఖరాలకు సెన్సెక్స్, నిఫ్టీ

Bank Nifty also closed at 28,062

ముంబై: దేశీ స్టాక్ మార్కెట్లు మరోసారి సరికొత్త శిఖరాలను చేరుకున్నాయి. బుధవారం మార్కెట్ సూచీలు అర శాతం లాభపడి, స్టాక్‌మార్కెట్ చరిత్రలోనే తొలిసారి సెన్సె క్స్, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లైఫ్‌టైమ్ గరిష్టాల వద్ద ముగిశా యి. సెన్సెక్స్ 222 పాయింట్లు జంప్‌చేసి 37,887 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 60 పాయింట్లు పెరిగి 11,450 వద్ద స్థిరపడింది. ఇక బ్యాంక్ నిఫ్టీ కూడా 28,062 వద్ద ముగిసింది. ఆసియా మార్కెట్ల మిశ్రమంగా ఉండడం, దేశీయంగా ఇన్వెస్టర్లు తొలి నుంచి కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో మార్కెట్లు రోజంతా లాభాలతో పరుగు తీశాయి. ఎన్‌ఎస్‌ఇలో ప్రధానంగా బ్యాంక్ నిఫ్టీ 0.7 శాతం, ఎఫ్‌ఎంసిజి 0.5 శాతం మేరకు లాభపడగా, ఫార్మా 0.7 శాతం క్షీణించింది.

నిఫ్టీ దిగ్గజాలలో ఒఎన్‌జిసి, ఆర్‌ఐఎల్, సిప్లా, ఇన్‌ఫ్రాటెల్, బజాజ్ ఫైనాన్స్, ఎస్‌బిఐ, హెచ్‌యుఎల్, ఐసిఐసిఐ, టాటా మోటార్స్, సన్ ఫార్మా 3 నుంచి -1 శాతం మధ్య పెరిగాయి. తొలి త్రైమాసిక ఫలితా లు నిరాశపరచడంతో లుపిన్ భారీగా 5 శాతం పతనమైం ది. మారుతి, హెచ్‌పిసిఎల్, బిపిసిఎల్, గ్రాసిమ్, బజాజ్ ఆటో, వేదాంతా, టెక్ మహీంద్రా, హెచ్‌సిఎల్ టెక్, ఎన్‌టిపిసి డీలాపడ్డాయి. బిఎస్‌ఇ మిడ్ క్యాప్ సూచీ 0.15 శాతం బలపడింది. ట్రేడైన మొత్తం షేర్లలో 1321 లాభపడగా, 1,417 షేర్లు నష్టాలతో ముగిశాయి. మంగళవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పిఐలు) రూ. 315 కోట్లు ఇన్వెస్ట్ చేయగా, దేశీ ఫండ్స్(డిఐఐలు) రూ. 320 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించాయి.

ఇరోస్ కొనుగోలుతో రిలయన్స్ షేరు జంప్
ఇరోస్ ఇంటర్నేషనల్‌లో 5 శాతం వాటాను రిలయన్స్ ఇండస్ట్రీస్ కొనుగోలు చేయడంతో కంపెనీ షేరు రాకెట్‌లా దూసుకెళ్లింది. బుధవారం ట్రేడింగ్‌లో రిలయన్స్ షేరు 3 శాతం వరకు ర్యాలీ చేసింది. అన్ని అనుమతులు పొందిన అనంతరం తమ సంస్థలో రిలయన్స్ ఇండస్ట్రీస్ 5 శాతం వాటా కొనుగోలు పూర్తయ్యిందని ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ ఇరోస్ ఇంటర్నేషనల్ స్టాక్ ఎక్చ్సేంజ్‌లకు సమాచారం ఇచ్చింది. ఇరోస్ నుంచి రిలయన్స్ 31,11,088 షేర్లను అంటే 5 శాతం వాటాలను సొంతం చేసుకుంది. ఇందుకు గాను రిలయన్స్ ఒక్కో షేరుకు 15 డాలర్ల చొప్పున మొత్తం 46.6 మిలియన్ డాలర్లు చెల్లించింది. రిలయన్స్ షేరు రూ.1188.40ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. కొనుగోలు వార్తలు వెలుగులోకి రావడంతో 2.06 శాతం లాభపడి రూ.1208.00 వద్ద కొత్త గరిష్టాన్ని నమోదు చేసింది. మార్కెట్ ముగిసే సరికి షేరు 3 శాతానికి పైగా లాభపడింది.

Comments

comments