Search
Friday 21 September 2018
  • :
  • :

అల్లీపూర్‌లో బ్యాంకు దోపిడికి యత్నం

Bank-Theftఅలారం మోగడంతో పరారైన దుండగులు
కిటీకి ఊచలు పగులగొట్టి చొరబడ్డ ఆగంతకులు
రాయికల్ : మండలంలోని అల్లీపూర్ తెలంగాణ గ్రామీణ బ్యాంకును దోచుకునేందుకు కొందరు దుండగులు ప్రయత్నించిన సంఘటన సోమవారం అర్దరాత్రి జరిగింది. స్థానికులు,జగిత్యాల డిఎస్పీ రాజేంద్రప్రసాద్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామ నడిబొడ్డున ఉన్న తెలంగాణ గ్రామీణ బ్యాంకు వెనుక వైపున ఉన్న కిటికి ఊచలు పగులగొట్టి ఆగంతకులు లోనికి ప్రవేశించారు. లోనికి వచ్చే ముందే భవనం బయట విద్యుత్ కనెక్షన్ తొలగించారు. హల్‌లోకి వచ్చి ఇక్కడ ఉన్న సిసి కెమెరాను ధ్వంసం చేసారు. ఆనంతరం క్యాషియర్ గది తులపు తెరిచి అందులోకి వెళ్లి ఇక్కడ ఉన్న సిసి కెమెరాను పగులగొట్టారు. ఆనంతరం లాకర్‌ను తెరిచే ప్రయత్నం చేయగా అందులో ఉన్న అలారం మ్రోగింది. ఈ శబ్దానికి ఆగంతకులు పరారై ఉండవచ్చని డిఎస్పీ వివరించారు. అలారం మ్రోగుతున్న విషయాన్ని స్థానికులు తెల్లవారుజామున బ్యాంకు సిబ్బందికి సమాచారమిచ్చారు. బ్యాంకు ఉదయం చేరుకొని చోరికి యత్నం జరిగినట్లు గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేసారు. దాంతో జగిత్యాల డిఎస్పీ రాజేంద్రప్రసాద్,ఇంచార్జ్ సిఐ రాజశేఖర్‌రాజు,ఎస్‌ఐ తిరుమల్‌గౌడ్‌లతో పాటు క్లూస్ టీం సభ్యులు బ్యాంకుకు చేరుకొని విచారణ జరిపారు.అలారం మ్రోగడంతో లాకర్‌ను తెరువకుండానే దుండగులు పరారైయ్యారని,దాంతో ఈ బ్యాంకులో ఏలాంటి ఆస్తి చోరికి గురి కాలేదని డిఎస్పీ విలేకరులకు తెలిపారు. అలారం మ్రోగినప్పుడే స్థానికులు స్పందించి తమకు సమాచారం అందిస్తే దుండగుల ఆచూకీపై కొంత ప్రగతి లభించేదన్నారు.

Comments

comments