Home ఖమ్మం బ్యాంకుల్లో వడ్డీ మినహాయింపుపై రైతుల ఆందోళన

బ్యాంకుల్లో వడ్డీ మినహాయింపుపై రైతుల ఆందోళన

kmm3ఖమ్మం: ప్రభుత్వం చెపుతున్నది ఒకటి క్షేత్రస్థాయిలో జరుగుతున్నది మరొకటి. రైతులు వ్యవసాయ రుణాలను విడతలవారీగా విడుదల చేయడంతో పాటు తిరిగి రుణాలు ఇస్తారని ప్రభుత్వం ప్రకటించగా ప్రభుత్వం జమ చేసి సొమ్మును బ్యాంకులు వడ్డీ కింద జమ వేసుకోవడంతో రైతులు ఆందోళనకు దిగిన సంఘటన సోమవారం కూసుమంచిలో చోటు చేసుకుంది. స్థానిక ఎస్‌బిహెచ్ బ్యాంకు మేనేజర్ కోటేశ్వరరావు ప్రభుత్వం జమ చేసిన సొమ్మును వడ్డీ కింద మినహాయిస్తామని తేల్చి చెప్పారు. ప్రభుత్వం నుండి మాకు అదేవిధంగా ఆదేశాలు ఉన్నాయని, తాము చేసేది ఏమీ లేదని చెప్పడంతో రైతుల ధర్నా దిగారు. బ్యాంకు కార్యకలాపాలు స్తంభించడంతో లీడ్ బ్యాంకు మేనేజర్ శ్రీనివాస్ అటు రైతుతోను, ఇటు బ్యాంకు మేనేజర్‌తో మాట్లాడారు. వడ్డీ మినహాయించకుండా రుణాలు ఇస్తామని చెప్పడంతో రైతులు ఆందోళన విరమించారు. ఆందోళన కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు నల్లమల్ల సుబ్బారావు, పోటు లెనిన్, బిక్కసాని గంగాధర్, మల్లెల మన్మధరావు, తాళ్లూరి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.