Home బిజినెస్ 31 కోట్ల ఖాతాదారులపై ఎఫెక్ట్

31 కోట్ల ఖాతాదారులపై ఎఫెక్ట్

  • కనీస బ్యాలెన్స్, ఇతర చార్జీ నిబంధనలను పునఃపరిశీలించాలి
  • ఎస్‌బిఐని కోరిన ప్రభుత్వం

Money-Banks

న్యూఢిల్లీ : కనీస బ్యాలెన్స్‌ను నిర్వహించని ఖాతాదారులపై పెనాల్టీ విధించాలనే నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని ఎస్‌బిఐని ప్రభుత్వం కోరింది. ఏప్రిల్ 1 నుంచి అమ లు చేయాలనుకుంటున్న ఈ నిర్ణయం కారణంగా సుమా రు 31 కోట్ల మంది సేవింగ్ ఖాతాదారులపై ప్రభావం పడ నుందని పేర్కొంది. నగదు లావాదేవీలు, ఎటిఎం విత్ డ్రాలపై ఛార్జీలను కూడా పరిశీలించాలని ప్రభుత్వం సూ చించింది. రూ. 5వేల కనీస బ్యాలెన్స్‌ను లేనిపక్షంలో రూ. 20-100 వరకు ఛార్జీలను బ్యాంక్ నిర్ణయించింది. ఐదేళ్ల విరామం తర్వాత కనీస బ్యాలెన్స్ నిర్వహించని వారిపై పెనాల్టీని ఎస్‌బిఐ(స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) ప్రవేశ పెట్టింది. ఇప్పటికే హెచ్‌డిఎఫ్‌సి, ఐసిఐసిఐ బ్యాంక్, యా క్సిస్‌బ్యాంక్ వంటి కొన్ని ప్రైవేటు బ్యాంకులు కూడా నెలలో నాలుగు ఉచిత లావాదేవీలను మించి చేసే డిపాజి ట్లు, విత్‌డ్రాలపై రూ.150 చార్జీని ప్రారంభించాయి. తా జాగా ఎస్‌బిఐ నిర్ణయంతో దాదాపు 31 కోట్ల మంది డిపాజిటర్లపై(పెన్షనర్లు, విద్యార్థులతో కలిపి) ప్రభావం పడనుంది. ఎస్‌బిఐ సవరించిన చార్జీల ప్రకారం, ఖాతా దారులు నెలవారి కనీస బ్యాలెన్స్(ఎంఎబి) రూ.5000ను కల్గి ఉండనట్లయితే రూ.100 పెనాల్టీ, సేవా పన్ను విధిస్తారు. ఎస్‌బిఐ, ఐదు అనుబంధ సంస్థల ఖాతాదారు లు ఈ కనీస బ్యాలెన్స్‌ను పాటించాలి. ఎటిఎంలతో పాటు ఇతర చార్జీలను కూడా సవరించి ఏప్రిల్ 1 నుంచి అమలు చేయనున్నట్టు బ్యాంక్ ప్రకటించింది. అలాగే సేవింగ్ బ్యాంక్ ఖాతాదారులు మూడుసార్లకు మించి నగదు డిపాజిట్ చేస్తే.. ప్రతి నగదు డిపాజిట్‌పై రూ.50 చార్జీ, సేవా పన్ను పడనుంది. కరెంట్ ఖాతా కనీసం రూ.20 వేలు ఉండాలని బ్యాంక్ సూచించింది.
ఛార్జీలపై ఆగ్రహం
ఎస్‌బిఐ చర్యలు పేదలు, మధ్య తరగతి వారికి వ్యతి రేకంగా ఉన్నాయని సోషల్ మీడియాలో ఆందోళన వ్యక్త మవుతోంది. ఇప్పటికే ఎల్‌పిజి సిలెండర్‌పై రూ.86, ఎటి ఎం లావాదేవిలపై రూ.150 కనీస నిల్వ పెనాల్టీలతో భా రం మోపారని అంటున్నారు. ఎస్‌బిఐ అన్యాయంగా చార్జీ లు పెంచిందని వాపోయారు. కనీస నిల్వను తప్పనిసరి చేసిన ఎస్‌బిఐపై భారతీయ రిజర్వు బ్యాంకు(ఆర్‌బిఐ) ఎందుకు చర్యలు తీసుకోదని ప్రశ్నించారు. కొత్తగా ప్రవే శపెట్టిన రుసుములతో ఖాతాదారులకు ఎదురుదెబ్బ తగి లిందని ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంకుల్లో నగదు జమ చేసేలా ప్రజలపై ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చిందని, ఇప్పు డు ప్రజల ధనంపై చార్జీలు, సర్వీసు రుసుములు విధిం చిందని మరొకరు పేర్కొన్నారు. ఎస్‌బిఐ ప్రవేశపెట్టిన చార్జీలు అడ్డగోలుగా ఉన్నాయని, దీనిపై పోరాటం చేయా లని మరొకరు పిలుపునిచ్చారు. ఏప్రిల్ 6న నో ట్రాన్సక్షన్ డేగా పాటించి నిరసన తెలపాలని సోషల్ మీడియా వేదికగా ప్రచారం ఊపందుకుంది.