Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

5000 కోట్లు వసూలు చేశాయ్..

Banks on minimum non-balance accounts in the last year

గతేడాదిలో కనీస బ్యాలెన్స్ లేని ఖాతాలపై బ్యాంకుల
24 బ్యాంకుల్లో సగం వసూళ్లు ఎస్‌బిఐవే: నివేదిక వెల్లడి

ముంబై : కనీస బ్యాలెన్స్ పేరిట బ్యాంకులు కస్టమర్ల నుంచి భారీగా వసూళ్లు చేపట్టాయి. గత ఆర్థిక సంవత్సరం(201718)లో ఖాతాల్లో కనీస బ్యాలెన్స్ నిర్వహించని కస్టమర్ల నుంచి దాదాపు రూ.5 వేల కోట్లు వసూలు చేసినట్టు తాజా నివేదిక ద్వారా వెల్లడైంది. ఈ మొత్తం వసూళ్లు 21 ప్రభుత్వరంగ బ్యాంకులు, మూడు ప్రైవేటురంగ బ్యాంకులకు చెందినవని బ్యాంకింగ్ డేటా పేర్కొం ది. ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బిఐ) 201718లో రూ.6,547 కోట్ల నికర నష్టాన్ని చవిచూసింది. ఈ నేపథ్యంలో కనీస ఖాతా బ్యాలెన్స్ నిర్వహించని కస్టమర్లపై జరిమానాను ప్రారంభించింది. నెల వారీగా కనీస బ్యాలెన్స్ లేకపోయినట్లయితే జరిమానా విధించడాన్ని 2017 ఏప్రిల్ నుంచి ఎస్‌బిఐ మళ్లీ పునఃప్రారంభించింది. 24 బ్యాంకులు కలిసి మొత్తంగా రూ.4,989 కోట్లు వసూలు చేస్తే.. దీనిలో ఎస్‌బిఐ వసూళ్లే సగం ఉండడం గమనార్హం. అయితే ఎస్‌బిఐ ఏడాదిలో మొత్తం రూ.2,433.87 కోట్ల జరిమానాను వసూలు చేసింది.

ప్రైవేటు రంగ బ్యాంకులైన యాక్సిస్, హెచ్‌డిఎఫ్‌సి, ఐసిఐసిఐ బ్యాంకులు వసూలు చేసిన ఛార్జీలు 30 శాతంగా ఉన్నాయి. ఎస్‌బిఐ తర్వాత ఈ జాబితాలో అత్యధికంగా వసూళ్లు చేపట్టిన బ్యాంక్ హెచ్‌డిఎఫ్‌సి..ఇది దాదాపు రూ.590.84 కోట్లు వసూలు చేసింది. అయితే ఈ బ్యాంకు 2016-17 ఆర్థిక సంవత్సరంలో ఖాతాదారుల నుంచి రూ.619.39 కోట్ల వసూళ్ల తో పోలిస్తే తగ్గడం గమనార్హం. ఇక యాక్సిస్ బ్యాంకు రూ.530.12 కోట్లు, ఐసిఐసిఐ బ్యాంకు రూ.317.6 కోట్లు వసూలు చేసింది. గత ఏడాది ఏప్రిల్ 1న ఎస్‌బిఐ ఖాతాదారుల కనీస సగటు నిల్వల నిబంధనలను సవరించి అధిక మొత్తంలో వసూలు చేయడంతో విమర్శలు వచ్చాయి. దీంతో ఆ ఛార్జీలను తగ్గిస్తూ 2017 అక్టోబర్ 1న ప్రకటన చేసింది. ప్రధాన మంత్రి జన్‌ధన్ యోజన కింద కొన్ని కోట్ల ఖాతాలకు కనీస సగటు నిల్వల నిబంధనలు వర్తించవు. అయినప్పటికీ ఇంత మొత్తంలో బ్యాం కులు వసూలు చేయడం విశేషం.

Comments

comments