Search
Friday 16 November 2018
  • :
  • :

కెఎఫ్‌సి చికెన్‌ను నిషేధించిన ముస్లీం పెద్దలు!

KFC-Chickenబరేలీ : ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కంటకీ ఫ్రైడ్ చికెన్(కెఎఫ్‌సి)లో చికెన్ తింటే అది పాపం అవుతుందని, అందువల్ల అక్కడ చికెన్ తినొద్దని ఉత్తరప్రదేశ్ బరేలిలోని దర్గా-ఎ-అలా హజరత్ మతపెద్దలు ఫత్వా జారీ చేశారు. కెఎఫ్‌సి ఔట్‌లెట్లలో అందించే చికెన్ హలాల్ చేసినది కాదని, అందువల్ల అది ఇస్లామ్ చట్టాలకు లోబడి ఉండదని సీనియర్ ముఫ్తీ సలీమ్ నూరీ తెలిపారు. కెఎఫ్‌సిలో మాంసాన్ని ముస్లీంల కళ్లెదుట ప్రాసెస్ చేయరని, అందువల్ల అది ఇస్లామ్ నిబంధనల ప్రకారం తప్పని ఆయన అన్నారు.
ఈ స్టోర్ల వద్ద ప్రదర్శించే హలాల్ సర్టిఫికేట్లకు ఏ మాత్రం విలువ లేదని, మాంసాన్ని ప్రాసెస్ చేయడానికి తాము ఎలాంటి విధానాలు అవలంబిస్తామో వాళ్లు అందులో రాయట్లేదని నూరీ పేర్కొన్నారు. కెఎఫ్‌సి వాళ్లు ఇస్లామిక్ పద్దతిలో మాంసాన్ని వండరు కాబట్టి షరియత్ చట్టానికి అది వ్యతిరేకమని ముఫ్తీ తెలిపారు.

Comments

comments