Search
Sunday 23 September 2018
  • :
  • :

రంజీలో బెంగాల్‌ను ఓడించిన బరోడా

ranjiహర్యానా: ఇక్కడి బన్సీలాల్ స్టేడియంలో జరిగిన రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో బరోడా జట్టు,  బెంగాల్ జట్టును 21 పరుగులతో ఓడించింది. పైగా రెండు రోజుల్లో 40 వికెట్లు పతనమయ్యాయి. రెండో ఇన్నింగ్స్‌లో బరోడా నిర్దేశించిన 155 పరుగుల లక్ష ఛేదనకు దిగిన బెంగాల్ జట్టు 133కే ఆలౌట్ అయింది. మొదటి రోజున 23 వికెట్లు పతనం కాగా రెండో రోజున 17 వికెట్లు పతనం అయ్యాయి. ఈ సీజన్‌లో బరోడా మొదటిసారి గెలిచింది. ఆరు మ్యాచ్‌ల ద్వారా బరోడా తొమ్మిది పాయింట్లు సాధిం చింది. మరోవైపు  హుబ్బలీలో ముంబయిపై గుజరాత్ రెండో రోజు ఆట ముగిసే సమ యానికి ఆధిక్యతను సాధించింది. ప్రియాంక్ కిరీట్ పంచాల్  తన తొలి ఫస్ట్ క్లాస్ డబుల్ సెంచరీ చేసి గుజరాత్‌ను ఆధిక్యతలో నిలిపాడు. ఢిల్లీలో గ్రూప్-ఎలో మధ్య ప్రదేశ్ లెఫ్ట్‌ఆర్మ్ స్పిన్నర్ అంకిత్ శర్మ 108 పరుగులకు 6 వికెట్లు తీసుకుని రైల్వే జట్టు ను 371 పరుగులకే కట్టడి చేశాడు. మధ్యప్రదేశ తన బ్యాటింగ్‌ను చిన్నగా ఆరంభించి ఆడుతోంది. నాగ్‌పూర్‌లో పంజాబ్‌పై ఆడిగున్న తమిళనాడు జట్టుకు చెందిన కౌశిక్ గాంధీ, దినేశ్ కార్తీక్‌లు తమ జట్టును ఆధిక్యతలో నిలిపారు. కౌశిక్ గాంధీ 209 బంతులాడి 75 పరుగులతో అజేయంగా నిలిచాడు. కార్తీక్ 93 బంతులాడి 54 పరుగులకు ఔట్ అయ్యాడు. మొదటి ఇన్నింగ్స్‌లో పంజాబ్ చేసిన 284 స్కోరుకు ఆట ముగిసే సమయానికి తమిళనాడు ఇంకా 66 పరుగులు చేయాల్సి ఉంది.

Comments

comments