Home దునియా పొదగడానికి అంటార్కిటికా వెళ్తుంటాయి..!

పొదగడానికి అంటార్కిటికా వెళ్తుంటాయి..!

Bartail Godwit

 

బార్‌టేల్ గాడ్‌విట్ అనే పక్షులు ఆహారం కోసం కూడా ఎక్కడా ఆగకుండా ఎనిమిది రోజుల పాటు ప్రయాణం చేస్తాయి. ప్రపంచంలో సుదీర్ఘ దూరం వలస వెళ్లిన పక్షిగా ఇది రికార్డు కొట్టింది. యూకేలోని ఫర్న్ దీవుల్లో ఉండే ఈ పక్షులు ఏటా అంటార్కిటికాకు వలస వెళ్లి మళ్లీ తిరిగి వస్తాయి. ఈ ప్రయాణమంతా కలిపితే 95,997 కిలోమీటర్ల దూరం అవుతుంది. అంటే భూమిని రెండుసార్లు చుట్టి వచ్చేంత దూరమన్నమాట. ఈ పక్షుల బరువు వంద గ్రాములే అయినా వేలాది కిలోమీటర్ల దూరం వలస వెళ్లడం వీటి ప్రత్యేకత. ఇవి ఎగురుతున్నప్పుడు ఆకలేస్తే సముద్రాల, సరస్సుల ఉపరితలాల మీదుగా వెళుతూ చటుక్కున చేపల్నీ, చిన్న చిన్న జలచరాల్నీ పట్టుకుని తినేస్తాయి.

గంటకు 35 కిలోమీటర్ల వేగంతో వెళ్లే ఈ పక్షులు రోజుకు 300 నుంచి 400 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేస్తాయి. ఇవన్నీ పరిశోధనల ద్వారా తెలుసుకున్నారు. వలస వెళ్లబోయే ముందు 29 ఆర్కిటిక్ టెర్న్ పక్షుల్ని తీసుకుని వాటికి తేలికపాటి జియోలొకేటర్లు అమర్చి పరీక్షించారు శాస్త్రవేత్తలు. అంటే ఈ పక్షులు ఎక్కడెక్కడ తిరిగినా ఆ వివరాలన్నీ తెలుసుకుంటారు. ఇవి ఫర్న్ దీవుల నుంచి చలికాలంలో పొదగడానికి అంటార్కిటికా బయలుదేరి వెళ్లి తిరిగి వస్తుంటాయి. ఈ క్రమంలో ఇవి అత్యధిక దూరం ప్రయాణించి రికార్డు కెక్కాయి. జీవిత కాలంలో సుమారు 30లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణం చేస్తాయన్నమాట.

 

Bartail Godwit Went to Fun Island for Incubation Period
Telangana news