Home నిర్మల్ వసంత పంచమికి బాసర ఆలయం ముస్తాబు

వసంత పంచమికి బాసర ఆలయం ముస్తాబు

రేపటి నుంచి మూడు రోజులు ఉత్సవాలు
భారీగా తరలిరానున్న యాత్రికులు
బాసర అభివృద్ధిపై భక్తుల కోటి ఆశలు
భారతదేశంలో ప్రసిద్ద పుణ్యక్షేత్రం
ముందడుగు వేయాని అభివృద్ధి ప్రణాళిక
అరకొర వసతులతో భక్తులకు ఇక్కట్లు
వసంత పంచమి వేడుకలకు సిఎం వచ్చేనా?

Basara-Temple

బాసర: దక్షిణ భారతదేశంలో పవిత్ర పు ణ్యక్షేత్రమైన చదువులతల్లి శ్రీజ్ఞాన సరస్వతీ దేవి జన్మో త్సవం(వసంతపంచమి)ప్రతి సంవత్సరం మాఘా శుద్ద పం చమి రో జున నిర్వహించే అమ్మవారి జన్మదిన వేడుకలకు బాసర ఆలయ ముస్తాబైంది.చిన్నారులకు అక్షర స్వీకరా లు, పూజలను చేపట్టడానికి దివ్యమైన శుభముహూర్తం కా వడంతో ఫిభ్రవరి 01న వసంత పంచమి వేడుకలకు ఆల యాధికారులు అన్ని ఏర్పాట్లను చేస్తున్నారు.
మంచి ముహూర్తం,పూజ వివరాలు

వీణధారిణీ సకల విద్య కళాభినేత్రి సరస్వతీ జన్మదినాన్ని వసంత పంచమి ప్రతి సంవత్సరం మాఘ మాసంలో వచ్చే శుద్ధ పంచమిని వసంత పంచమి, శ్రీపంచమి, మధన పం చమిగా పిలుస్తారు. మంచి పనులు శుభలగ్నలకు , శుభా కార్యలకు,గృహప్రవేశాలు,తదితర చిన్నారులకు అక్షరభ్యా సాలు, వసంత పంచమిని విశిష్ట దినంగా భావిస్తారు. ౩౦న సోమవారం వేకువాజామున నిత్యాభిషేకంతోపాటు వేద పఠనము, ఛండీపారాయణం, మంగళవారం రుద్ర స్వాహా కారము, మంత్ర పుష్పం, వేకువాజామున బుధవారం అ మ్మవారికిమహాఅభిషేకంతదితర కార్యక్రమాలు ఉంటాయి. ఈ ఉత్సవాలకు మహారాష్ట్ర,తమిళనాడు,కర్ణాటక, ఆంధ్రప్ర దేశ్ చూట్టు పక్కల రాష్ట్రాల నుంచి భక్తులు తరలివస్తారు.

ఉత్సవాలకు భారీ భద్రత…

ఉత్సవాల నిర్వహణలో ఏలాంటి లోటుపాట్లు తలెత్తకుం డా వివిధ శాఖాలాధికారులు సమన్వయంతో కృషి చేస్తున్నా రు.భైంసా డిఎస్‌పి అందెరామలు స్థానిక పోలీస్ అధికారుల కు పలు సూచనలిచ్చారు.
వసంత పంచమికి భారీ ఏర్పాట్లు

ఈవో వెంకటేశ్వర్లు

వసంత పంచమి పర్వదినాన్ని పురస్కరించుకోని భక్తులు రానున్న దృష్యా తమ చిన్నారులకు అక్షర శ్రీకారాలు ది ద్ధించడానికి, ప్రత్యేక పూజలు చేయడానికి భక్తులకు ఏర్పా టు చేశామని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అమ్మ వారి జన్మదినమైన వసంత పంచమికి రాష్ట్ర దేవాదాయ శా ఖ మంత్రి అలోల్ల ఇంద్రకరణ్‌రెడ్డి, అటవీశాఖ మంత్రి జో గురామన్న, ఎంపి గేడం నాగేశ్ అమ్మవారికి పట్టు వస్త్రాల ను సమార్పించడానికి వస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

విశిష్టమైన సరస్వతీ ఆలయం తెలంగాణకే తలామానికం జిల్లాను దేశపర్యాటక చిత్రపటంలో నిలుపుతున్న అమ్మవా రి ఆలయం అరుదైనది.రాష్ట్ర ప్రభుత్వం ఆలయాల అభివృ ద్ధికి ప్రాథాన్యతను ఇస్తున్న తరుణంలో బాసరను మాత్రం విస్మరిస్తున్నారు. తొలిదశ బ్రహత్ ప్రణాళిక కింద రూ. 126 కోట్లతో ఆలయాన్ని అభివృద్ధి పర్చాలని నిర్ణయి ంచా రు.ప్రతిపాదనాలు సైతం సిద్ధమయ్యి సంవత్సరం పైబడిన అభివృద్ధి జాడ కనబడడం లేదు. రాష్ట్రంలోని ప్రముఖ ఆల య అభివృద్ధి వైపు అడుగు వేస్తుండగా తెలంగాణలో ప్ర ముఖ ఆలయాల్లో ఓకటైన అమ్మవారి ఆలయం అభివృద్ధి విషయంలో మాత్రం వెనుక బడు కొనసాగుతుంది.

కనీస సౌకర్యలు కరువు…

బాసర సరస్వతీ ఆలయం చూట్టు సమస్యల తిష్ట వేసి ఉ ంది.గర్భగుడీ, అంతారాలయం,శిథిలావస్థకు చేరుకుంటుం ది. 40సంవత్సరాల కింద నిర్మించిన రాజగోపురం వర్షాని కి ఉరుస్తు గర్భగుడీ తడిసి ముందవుతుంది. భారి వర్షాలు పడితే భక్తులకు అంతరాయం కలుగు తుంది. అమ్మవారి అ భిషేకంలో పాల్గొన్న భక్తులకు అమ్మవారిని దర్శించుకునే అవకాశం కలగడం లేదు. రోజురోజుకు పెరుగుతున్న రద్దీ దృష్యా ఆలయాన్నివిస్తరించాల్సిన అవసరం ఉన్నా ఆదిశగా ఎటువంటి చర్యలు లేవు.మౌలిక వసుతులైన అతిథి గృహా లు, మరుగుదొడ్లు, మంచినీటికి భక్తులకు ఇబ్బందులను ఎ దుర్కొవాల్సి వస్తుంది.

ఆలయ అభివృధ్దిపై ప్రభావం…

బాసర ఆలయంలో అభివృద్ధి నిలిచిపోవడం క్షేత్రంపై ప్రభా వం చూపుతుంది. రాష్ట్రంలోని మిగత ఆలయాలు భక్తులతో ఆధిక ఆదాయంతో కళకళలాడుతుండగా బాసర పరిస్థితి మాత్రం విరూద్దంగా ఉంది. దసరనవరాత్రులు, వసంత ప ంచమి, గురుపౌర్ణమి, మూలనక్షత్ర సమయాల్లో మినహా మిగత సమయాల్లో భక్తుల సంఖ్య మాత్రం స్వల్పంగా ఉం టుంది. ఉదయం వచ్చి అమ్మవారిని దర్శించుకోని సాయ ంత్రానికి ఇంటికి తిరుగుముఖం పడుతున్నారు. గదుల కొ రత, కాలక్షేపానికి వసతులు లేకపోవడం , మౌలిక వసతు ల కొరత భక్తులను ఎక్కువ సమయంలో బాసరలో గడప నీయకుండా చేస్తుంది.

వసంత పంచమికి ముఖ్యమంత్రి వచ్చేనా?

చదువుల తల్లి శ్రీజ్ఞానసరస్వతీ అమ్మవారి జన్మదినం కావడ ంతో ఈ కార్యక్రమానికి సిఎం కెసిఆర్ హాజరై ఆలయాభి వృద్ధికి హామీలు కురిస్తాడన్న ఆశలు స్థానికుల్లో వ్యక్తం అవు తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రం ఏర్పాడి మూడు సంవ త్సరాలు గడుస్తున్న ఇప్పటికి సిఎం బాసర ఆలయానికి సందర్శించ లేదు.తెలంగాణలో కోమురవెళ్లి, యాదాద్రి, వే ములవాడ ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వ అధికారీకంగా పెద్ద పీట వేసింది. భారత దేశంలో సుప్రసిద్ధ దేవాలయం చదువుల తల్లి శ్రీజ్ఞాన సరస్వతీ క్షేత్రం నిత్యం భక్తులకు కి టకిటలాడుతు తమ చిన్నారులకు అక్షరబ్యాసాలు దిద్దుతా రు.ఇప్పటికైన శ్రీ పం చమి, వసంత పంచమికి పట్టు వస్త్రా లు సమార్పించడానికి బాసర ఆలయానికి వచ్చి ఆలయా భివృద్ధికి వరల జల్లు సమాకురస్తారనని భక్తులు , స్థానికు లుతమ ఆశభావం వ్యక్తం చేస్తున్నారు.