Search
Sunday 18 November 2018
  • :
  • :
Latest News

బసవేశ్వరుడు గొప్ప సంఘ సంస్కర్త

Basaveshwar is a Great Social Reformer : Harish Rao

సిద్దిపేట : బసవేశ్వరుడు గొప్ప సంఘ సంస్కర్త అని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. పొన్నాల దాబాల సర్కిల్‌లో ఆదివారం బసవేశ్వర విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 12వ శతాబ్దంలో కులరహిత సమాజం కోసం బసవేశ్వరుడు ఎంతగానో కృషి చేశారని ఆయన కొనియాడారు. ఆయన మహిళల విద్య కోసం ఎంతగానో కృషి చేశారని తెలిపారు. శ్రమను నమ్ముకొని జీవించాలన్నదే బసవేశ్వరుడి సిద్ధాంతమని ఆయన పేర్కొన్నారు. బసవేశ్వరుడి అడుగుజాడల్లో నడిచి సమసమాజ స్థాపనకు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన చెప్పారు. హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై బసవేశ్వరుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నామని, ఆయన జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించుకుంటున్నామని హరీశ్‌రావు వెల్లడించారు.

Basaveshwar is a Great Social Reformer : Harish Rao

Comments

comments