Home ఆదిలాబాద్ ఘనంగా బసవేశ్వరుడి జయంత్యుత్సవాలు

ఘనంగా బసవేశ్వరుడి జయంత్యుత్సవాలు

Celbrection

మన తెలంగాణ/ఆదిలాబాద్ టౌన్ : మహాత్మా బసవేశ్వరుని 885వ జయంతిని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక బసవేశ్వరుని విగ్రహానికి జిల్లా కలెక్టర్ డి.దివ్య పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆదిలాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ రంగినేని మనీష మాట్లాడుతూ, మహిళలకు పార్లమెంటులో సముచిత స్థానం కల్పించారని, కులాంతర వివాహాలకు ప్రోత్సాహం కల్పించారని, తెలంగాణ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు సహకారం అందిస్తున్నదని, ఉన్నత పదవులకు మహిళలకు ప్రాధాన్యం కల్పిస్తున్నదని తెలిపారు. వచ్చే బసవేశ్వర జయంతిని ఘనంగా నిర్వహించాలని, అందుకు సహకరిస్తానని తెలిపారు. జాయింట్ కలెక్టర్ కె. కృష్ణారెడ్డి మాట్లాడుతూ 12వ శతాబ్ధంలో ప్రపంచంలోని పరిస్థితులకు వ్యతిరేకంగా ఎన్నో ప్రవచనాలు చేశారని, దేహమే దేవాలయం అని నిరూపించారన్నారు. సంప్రదాయాల ఆచరణ కోసం తన జీవితం త్యాగం చేసిన మహానుభావుడు బవేశ్వరుడని అన్నారు. పాయల శంకర్ మాట్లాడుతూ, మానవ సమాజానికి సేవ చేసిన వ్యక్తి అని ప్రతి గ్రామంలో బసవేశ్వర విగ్రహాలు స్థాపించాలని అన్నారు. గండ్రత్ సుజాత మాట్లాడుతూ మహాత్ముడి అశయాలను ఆదర్శంగా తీసుకోవాలని, భావితరాల వారికి ఆయన చేసిన కార్యక్రమాలు తెలియపర్చాలని అన్నారు. డిబిసిడిఒ ఆశన్న మాట్లాడుతూ ధర్మాన్ని రక్షించారని, నేటికి మనం సమాజ సేవ చేయాలని అన్నారు. ఈ కార్యక్రమానికి వెండి భద్రీశ్వర్‌రావు అధ్యక్షత వహించారు. అంతకు ముందు బసవేశ్వరుని చిత్రపటానికి సంప్రదాయంగా లింగాయతులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమం లో కౌన్సిలర్ శ్రీనివాస్, దేవన్న, ప్రవీన్, భాగ్యలక్ష్మీ, సత్యనారాయణ పాల్గొన్నారు.

నిర్మల్ : కులమత వర్ణ వ్యవస్థను రూపుమాపడంతో పాటు సామాజిక సమానత్వం కోసం పోరాడిన మహనీయుడు మహాత్మా బసవేశ్వరుడు అని జిల్లా కలెక్టర్ ఎం.ప్రశాంతి అన్నారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఆయన 885 జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ సామాజిక సమానత్వం కోసం పోరాడిన మహానీయుడన్నారు. బసవేశ్వరుడు చూపించిన మార్గంలో పయనించేందుకు కృషి చేయాలన్నారు. లింగాయత్ వర్గం అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను లింగాయత్‌లు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య ప్రణాళిక అధికారి మల్లికార్జున్, బిసి సంక్షేమ సంఘ అధికారి విజయ్‌కుమార్, డిఇఒ ప్రణిత, లింగయత్‌ల సంఘ అధ్యక్షులు పణింధర్‌రావు, జిల్లా అ ధ్యక్షులు కామన్న పటేల్, నాగభూషన్‌రావు, పండరినాథ్, సునీత, ప్రసాద్‌రావు, బిసి సంఘం అధ్యక్షులు కృష్ణంరాజు, టిఎన్‌జిఓ సంఘ అధ్యక్షులు ప్రభాకర్ ఉన్నారు.

నిర్మల్‌అర్బన్ : నిర్మల్ జిల్లాకేంద్రంలోని టి మాస్ కార్యాలయంలో బుధవారం టి మాస్ ఆధ్వర్యంలో బసవేశ్వర జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేశారు. అనంతరం టి మాస్ కన్వీనర్ కిషన్ మాట్లాడుతూ బసవేశ్వరుడు కర్ణాటకలో జన్మించిన ఒక గొప్ప సామాజిక ఉద్యమకారుడని కొనియాడారు. కుల వ్యవస్థలో గల అంటరానితనం, స్త్రీ వివక్షతకు వ్యతిరేకంగా ఉద్యమం నడిపిన మహానీయుడని, లింగాయత్ ధర్మం ద్వారా కులపీడను రూపుమాపారన్నారు. లింగాయత్‌లు వారి సమస్యల మీద పోరాడి వారి హక్కులను సాధించుకున్నారన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా నాయకులు ఎస్‌ఎన్‌రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రసాద్, జయశంకర్, సాయన్న, సుజాత, మేఘన పాల్గొన్నారు.

సిరికొండ : మండల కేంద్రంలో అక్షయ తృతీయను పురస్కరించుకొని బుధవారం లింగ బలిజా (వీరశైవ) బసవేశ్వర మహరాజ్ 885వ జయంతిని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి స్థానిక సర్పంచ్ ఓరగంటి పెంటన్న, బాలాజీ, రెవెన్యూ సిబ్బంది, లింగయూత్ బలిజా మండల అధ్యక్షులు చెండె ఓం ప్రకాశ్‌లు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ప్రకాశ్, కాశీనాథ్, చందు, మల్లేష్, సాగర్‌రెడ్డి, చెండె బాలాజీ, మల్లేష్, గంగాధర్, ఆనంద్‌రావ్, శంకర్ స్వామి ప్రవీణ్, భాస్కర్, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.