Home జగిత్యాల బాస్కెట్‌బాల్ ఆట…భవితకు బాట

బాస్కెట్‌బాల్ ఆట…భవితకు బాట

Basketball game ...future on the route

క్రీడను నమ్ముకున్న పలువురికి ఉన్నత ఉద్యోగాలు
రాష్ట్ర, జాతీయ స్థాయిలో జగిత్యాలకు గుర్తింపు                                                                                                              1956లోనే బాస్కెట్‌బాల్ కోర్టు నిర్మాణం
జిల్లాలో ఒక్క జగిత్యాలలోనే ఉచితంగా శిక్షణ

బాస్కెట్ బాల్ ఆట.. క్రీడాకారులు ఉన్నతంగా బతికేందుకు బాట చూపింది. చిన్నతనంలో సరదాగా ఆడిన ఆ క్రీడ పలువురికి ఉన్నత ఉద్యోగాలను సాధించి పెట్టింది. రాష్ట్ర, జాతీయ స్థాయిలో జగిత్యాలకు మంచి గుర్తింపును తెచ్చింది. 1956లోనే జగిత్యా లలో బాస్కెట్‌బాల్ కోర్టు నిర్మాణమైందంటే ఈ ఆట పట్ల ఇక్కడి వారికి ఎంత ఆసక్తి ఉందో స్పష్టమవుతోంది. బాస్కె ట్ బాల్ క్రీడ లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి పిఇటిలుగా ఉద్యోగాలు సా ధించిన పలువురు సీనియర్ క్రీడాకా రులు తాము నేర్చు కున్న క్రీడా మెళకువలను ప్రతి రోజు విద్యార్థులకు వివరిస్తూ బాస్కెట్‌బాల్ క్రీడ లో రాణించేలా తీర్చిది ద్దుతు న్నారు. ఈ నేపథ్యం లో ‘ మన తె లంగాణ’ అంది స్తున్న ప్రత్యేక కథనం..

మనతెలంగాణ/జగిత్యాల: బాస్కెట్‌బాల్ క్రీడ అంటేనే జగిత్యాల పేరు గుర్తుకు వస్తుంది. జగిత్యాలకు చెందిన ఎందరో క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని జగిత్యాల పేరును దశ దిశలా చాటారు. 1956 లోనే జగిత్యాలలో బాస్కెట్‌బాల్ కోర్టు నిర్మాణం జరిగిందంటే ఆ క్రీడ పట్ల జగిత్యాల ప్రాంత వాసులకు ఎంత ఆసక్తి ఉందో అర్ధమవుతోంది. సరదాగా ఆడిన బాస్కెట్‌బాల్ ఆట క్రీడాకారుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసింది. ఆనాడు బాస్కెట్‌బాల్ ఆటలో క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించిన క్రీడాకారుల వల్ల జగిత్యాలకు రాష్ట్ర, జాతీయ స్థాయిలో గుర్తింపు రావడంతో పాటు నేడు వారు వివిధ శాఖల్లో ఉద్యోగాలు పొంది జీవితంలో స్థిరపడ్డారు.

1956లోనే జగిత్యాలలో బాస్కెట్‌బాల్ క్రీడకు పునాది: 
జగిత్యాల ప్రభుత్వ పురాతన ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా పనిచేసిన శ్యాంసన్, ముద్దు రామక్రిష్ణయ్యలు బాస్కెట్‌బాల్ క్రీడకు పునాది వేశారు. అప్పట్లో మట్టి కోర్టును ఏర్పాటు చేసి బాస్కెట్‌బాల్ క్రీడా మెళకువలను నేర్పి ఎందరో క్రీడాకారులను తీర్చిదిద్దిన ఘనత జగిత్యాలకే దక్కింది. క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన పలువురు క్రీడాకారులు స్పోర్ట్ కోటాలో వివిధ శాఖల్లో ఉద్యోగాలు పొందగా పలువురు వ్యాయామ ఉపాధ్యాయులుగా వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న పలువురు పిఇటిలు తాము నేర్చుకున్న క్రీడా మెళకువలను ప్రతి రోజు ఉదయం, సాయంత్రం వేళల్లో చిన్నారులకు నేర్పిస్తూ వారిని ఉత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారు. మొదటగా గాజుల నారాయణ, హన్మాండ్లు ఆ తర్వాత కాలంలో పుప్పాల కిషన్, ప్రభాకర్, పుప్పాల గంగాధర్, శివశంకర్, గంగారాం, షకీల్, సత్తయ్య, సుధీర్, శ్రీపాల్‌రెడ్డిలు తమ క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించి జిల్లా, రాష్ట్ర స్థాయిలో జగిత్యాలకు ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చారు. 1986లో బాస్కెట్‌బాల్ వేసవి శిక్షణా శిబిరానికి వచ్చిన అప్సర్ ఫరూఖ్ ఇచ్చిన శిక్షణతో క్రీడాకారుల్లో బాస్కెట్‌బాల్ క్రీడపై ఆసక్తి మరింత పెరిగింది. ఆ శిబిరంలో శిక్షణ పొందిన గోవిందుల వెంకటరమణ, పడాల విశ్వప్రసాద్‌లు ఇచ్చిన శిక్షణతో ఎంతో మంది క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో రాణించి ఎన్నో పథకాలను కైవసం చేసుకోవడంతో పాటు వివిధ శాఖల్లో ఉద్యోగాలు పొంది స్థిరపడ్డారు.

నాడు క్రీడాకారులు… నేడు ఉద్యోగులుగా
ఆనాడు క్రీడాకారులుగా ఉన్న వెంకటరమణ నేడు స్పోర్ట్ అథారిటీ డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తుండగా, విశ్వప్రసాద్, గాజుల నిరంజన్, శ్రీధర్‌రావు, రవికుమార్, కృష్ణప్రసాద్, అజయ్‌బాబు, విద్యాసాగర్, రాము, సంధ్య, మల్లీశ్వరి, మాధవి, వెంకటలక్ష్మి, జమునారాణి, జ్యోతిలు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో వ్యాయామ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. ప్రభాకర్, మధులత, అజయ్‌బాబు, సతీశ్, అనిల్, శశికుమార్, విద్యాసాగర్‌లు పోలీస్ శాఖలో ఉద్యోగాలు చేస్తున్నారు. వీరితో పాటు పదుల సంఖ్యలో స్పోర్ట్ కోటాలో ఉద్యోగాలు సాధించి జీవితంలో స్థిరపడ్డారు.

జగిత్యాలలో 9 రాష్ట్ర స్థాయి టోర్నమెంట్లు :
జగిత్యాలలో రోజు రోజుకు బాస్కెట్‌బాల్ క్రీడాకారుల సంఖ్య పెరుగుతుండటంతో నాటి మట్టి కోర్టు స్థానంలో ఆధునాతన వసతులతో రెండు సిమెంట్ కోర్టులు ఏర్పాటు చేశారు. జగిత్యాల పట్టణంలో ఇప్పటి వరకు 9 సార్లు రాష్ట్ర స్థాయి టో గ్రామాల అబివృద్దే ప్రభుత్వ ద్యేయం ర్నమెంట్లు జరిగా గ్రామాల అబివృద్దే ప్రభుత్వ ద్యేయం యి. జగిత్యాల నుంచి 42 మంది జాతీయ స్థాయిలో, 32 మంది యూనివర్శిటీ స్థాయిలో పాల్గొని జగిత్యాల పేరును జాతీయ స్థాయిలో ఇనుమడింపజేశారు. జగిత్యాలలో నిత్యం ఉదయం, సాయంత్రం వేళల్లో పిఇటిలు విశ్వప్రసాద్, క్రిష్ణప్రసాద్, నిరంజన్, అజయ్‌బాబు తదితరులు విద్యార్థులకు క్రీడా మెళకువలు నేర్పిస్తూ ఉత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్దుతున్నారు. దాంతో ఉదయం, సాయంత్రం వేళల్లో బాస్కెట్‌బాల్ కోర్టులు చిన్నారులతో నిండిపోతున్నాయి.
బాస్కెట్‌బాల్ క్రీడాభివృద్దికి జగిత్యాల ప్రాంత విద్యార్థులు అమితాసక్తి చూపుతున్న నేపథ్యంలో ప్రభుత్వం మరిన్ని సదుపాయాలు కల్పిస్తే క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించే అవకాశముంది. నాటి క్రీడాకారులంతా నేడు వివిధ శాఖల్లో ఉద్యోగాల్లో స్థిరపడటంతో నేటి యువత కూడా బాస్కెట్‌బాల్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి ఉన్నత శిఖరాలు అధిరోహించాలనే ఆకాంక్షతో ముందుకు సాగుతున్నారు. వారి ఆశలు ఫలించాలని మనమంతా కోరుకుందాం….