Home తాజా వార్తలు తెలంగాణ భవన్‌లో బతుకమ్మ సంబురాలు..

తెలంగాణ భవన్‌లో బతుకమ్మ సంబురాలు..

padma

హైదరాబాద్: తెలంగాణ భవన్‌లో ఘనంగా బతుకమ్మ సంబురాలు జరిగాయి. సోమవారం టిఆర్‌ఎస్ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఈ వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ వేడుకలకు మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, గుండు సుధారాణి, తుల ఉమ‌ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ ఆడ‌బిడ్డ‌లంద‌రికీ పద్మా దేవేందర్‌రెడ్డి బ‌తుక‌మ్మ శుభాకాంక్ష‌ల‌ను తెలియ‌జేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టిఆర్‌ఎస్ మహిళా విభాగం సభ్యులంతా కలిసి బతుకమ్మలను పేర్చి..అనంతరం  పాటలు పాడి బతుకమ్మ ఆట ఆడారు. మహిళల్లో ఉత్సాహాన్ని నింపుతూ వారితోపాటు పాటు పద్మాదేవేందర్ రెడ్డి  బతుకమ్మ ఆడారు.

padma1

Bathukamma celebrations in Telangana bhavan