Search
Wednesday 26 September 2018
  • :
  • :
Latest News

బిసి హాస్టల్ విద్యార్థుల అవస్థలు…

Bc-Hostel

* బురదమయంగా రహదారి
ఖమ్మం: కేసిఆర్ ప్రభుత్వం హాస్టల్‌లో విద్యార్థుల కోసం కోట్లు ఖర్చు పెడుతున్నామని చెపుతున్నా అది మాత్రం క్షేత్ర స్థాయిలో అమలు కాకపోవడానికి సింగరేణి మండలం బిసి హాస్టల్ కు వెళ్ళే బురదమయంగా ఉన్న రహాదారే నిదర్శనం. మండల కేద్రంలోని శివాలయం సమీపంలో కొన్ని సంవత్సరాలుగా విద్యార్థులకు నడవడానికి బురదమయంగా రహాదారి ఉండటంతో హాస్టల్‌లో ఉండే చిన్న పిల్లలు నానా అవస్థలు పడుతున్నారు. రాత్రి సమయంలో హాస్టల్ సమీపంలో పాములు, తేళ్ళు సంచరిస్తున్నాయని స్థానికులు తెలుపుతున్నారు. చిన్న వర్షానికే రోడ్డు మార్గం విద్యార్థులకు నడవలేని పరిస్థితి నెలకొంది. రొజుల తరబడి ఆ రోడ్డుపై వర్షపునీరు నిల్వ ఉండటంతో వాటిపై దోమలు చేరి చట్టు ప్రక్కల వారికి, హాస్టల్ పిల్లల అనారోగ్యానికి కారణమౌతున్నాయి. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించాలని విద్యార్థుల తల్లిదండ్రులు పరిసర ప్రాంత ప్రజలు కోరుకుంటున్నారు.

Comments

comments