Home రాష్ట్ర వార్తలు తెరుచుకోని బిసి వసతి గృహం

తెరుచుకోని బిసి వసతి గృహం

లగేజీలతో వెనుదిరిగిపోతున్న విద్యార్థినులు 

BC-Hostels

నిజామాబాద్/ డిచ్‌పల్లి: పాఠశాలలు ప్రారంభమై 14 రోజులు గడుస్తున్నా, బిసి బాలికల వసతి గృహానికి తాళం వేసి ఉంచడంతో విద్యార్థినులు తమ లగేజీతో వచ్చి వెనుదిరిగి వెళ్తున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా, వసతి గృహల్లో విద్యాబోధన, వసతితో పాటు పుస్తకాలు, దుస్తుల పంపి ణీ చేసినా అధికారుల నిర్లక్షం కొట్టొచ్చిన్నట్లు కనబడుతుంది. ఇందు కు ఖిల్లా డిచ్‌పల్లి బాలికల వసతి గృహమే నిదర్శనం. బిసి బాలికల వసతి గృహంలో సుమారు 92 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నా రు. ఈనెల 1న పాఠశాలలు, వసతి గృహాలు తెరవాలని ప్రభుత్వం ఆదేశిస్తే, ఖిల్లా డిచ్‌పల్లి వసతి గృహం తెరవకపోవడం గమనార్హం. పాఠశాలలు తెరిచినా బిసి బాలికల వసతి గృహం తెరవకపోవడంతో నూతనం గా వసతి గృహంలో చేరే విద్యార్థులు తిరిగి తమ ఇంటికి వెళ్లిపోతున్నారు. ప్రతిరోజు 10 నుండి 20 మంది విద్యార్థులు వసతి గృహానికి వచ్చి తాళం చూసి వెళ్తున్నారు. గురువారం పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు దేవరాజును కలిసి బిసి బాలికల వసతి గృహం తెరుస్తారా లేదా అని ప్రశ్నించారు.దీంతో ప్రధానోపాధ్యాయుడు వార్డె న్ విజయలక్ష్మికి ఫోన్ చేసి వసతి గృహం ఎప్పు డు తెరుస్తారు, తాళం ఎందుకు తీయడం లేదని అడుగుగా వసతి గృహంలో పనిచేసే సిబ్బంది బదిలీ అయ్యారని, అందుకే గురువారం తెరుస్తున్నామని సమాధానం ఇచ్చారు.  తిరిగి 12 గంట ల సమయంలో విలేకరులు వసతి గృహానికి వెళ్లే సరికి వసతి గృహం కేర్‌టెకర్ చంద్రకళ విద్యార్థినితో మాట్లాడుతూ ఉంది. గురువారం రోజున ఎంత మంది విద్యార్థులకు వంట చేసారని విలేకరులు ప్రశ్నించగా వసతిగృహంలో ఎవరు లేరని ఆమె సమాధానం ఇచ్చారు