Home ఖమ్మం కాంగ్రెస్ లో బిసిల లొల్లి

కాంగ్రెస్ లో బిసిల లొల్లి

మూడు జనరల్ స్థానాల్లో ఒక సీటు బిసిలకు ఇవ్వాలని డిమాండ్
రోజురోజుకు పెరుగుతున్న బిసిల ఒత్తిడి
 ఎటూ తేల్చుకోలేకపోతున్న కూటమి నేతలు

BC

మన తెలంగాణ/ఖమ్మం ప్రతినిధి : మహా కూటమిలో బిసి లొల్లి ప్రారంభమైంది. రాజ్యాధికారం కోసం పోట్లాడుతున్న బిసిలు మరోసారి గళం విప్పుతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న మూడు జనరల్ స్థానాల్లో ఒక సీటు బిసిలకు కేటాయించాలని వస్తున్న డిమాండ్ మహా కూటమిని ఇరుకున పెట్టింది. మహాకూటమిలోని నాలుగు పార్టీ ల మధ్య ఖమ్మం జిల్లా సీట్లపైనే పీఠమూడి పడినట్లు తెలుస్తుంది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నుంచి మూడు జనరల్ స్థానాల్లో బిసి అభ్యర్థులు పోటీ పడుతుండటంతో సీట్ల స ర్ధుబాటు ఒక కొలిక్కి రావడం లేదని సమాచారం. తెలంగాణలో అధికారంలో ఉన్న టిఆర్‌ఎస్ పార్టీని గద్దె దింపడానికి కాంగ్రెస్ నాయకత్వంలో టిడిపి, సిపిఐ, తెలంగాణ సమితి పార్టీలు కలిసి మహా కూటమిగా ఏర్పాటైన విష యం తెలిసిందే. అయితే కూటమిలో ప్రధానపార్టీ అయి నా కాంగ్రెస్ నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న మూడు జనరల్ స్థానాల్లో బిసి అభ్యర్థులు పోటీ పడి తమకే టిక్కెట్ కావాలని పోటీ పడటంతో ఇప్పుడు ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. కాంగ్రెస్ పార్టీలో కొత్తగూడెం నుంచి బిసికి చెందిన మాజీ మం త్రి వనమా వెంకటేశ్వరరావు, ఎ డవల్లి కృష్ణలు పోటిపడుతుండగా ఖమ్మం నుంచి ప్రముఖ గ్రానైట్ వ్యాపారి వద్దిరాజు రవిచంద్ర తనకే టిక్కెట్ కావాలని పట్టుబడుతున్నారు. ఇక పాలేరు నుంచి బిసికి చెందిన హైకోర్టు న్యాయవాది ఈడ శేషగిరిరావు కూడా పోటీ పడుతున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీకి దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ స్థానాలు ఉండగా అందులో ఎస్సీ, ఎస్టీలకు ఏడు స్థానాలు కేటాయించారు. మిగిలిన మూ డు స్థానాలు జనరల్ కేటగిరిలో ఉన్నాయి. ఖమ్మం, పాలేరు, కొత్తగూడెం మాత్రమే జనరల్ స్థానాలుగా ఉండటంతో ఈ మూడు స్థానాల నుంచి భారీగా పోటీ ఉండగా రెండింటిలో కాంగ్రెస్ నుంచి బిసిలే బలంగా పట్టుబడుతున్నారు.

అయితే మహా కూటమి పొత్తులో భాగంగా కొత్తగూడెం సీటును సిపిఐ గట్టిగా కోరుతుంది. ఈసారి సిపిఐ కేటాయిస్తే అక్కడి మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పోటీ చేస్తారు. ఇక మిగిలిన ఖమ్మం స్థానాన్ని టిడిపి కూడా బలంగా కావాలని పట్టుబడుతుంది. ఒప్పందంలో ఖమ్మం అసెంబ్లీ స్థా నాన్ని టిడిపికి కేటాయిస్తే ఇ క్కడ మాజీ ఎంపి నా మ నాగేశ్వరరావు పోటీ చేసే అవకాశముంటుంది. లే దా ఈ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకుంటే ఇక్కడ బిసికి చెందిన గ్రా నైట్ వ్యాపారి గాయత్రి రవి తనకే టిక్కెట్ కావాలని అడి గే అవకాశముంది. ఒకవేళ ఈ స్థానాన్ని టిడిపికి కేటాయిస్తే మాత్రం పాలేరు టిక్కెట్ కాంగ్రెస్ దక్కించుకునే అవకాశాలు అధికంగా ఉంటాయి. అప్పుడు అక్కడ రెడ్డి సామాజిక వర్గం నుంచి కందాల ఉపేందర్‌రెడ్డి, రామ సహాయం రఘురామిరెడ్డి, రాంరెడ్డి చరణ్‌రెడ్డి, మద్ది శ్రీనివాసరెడ్డిలు పోటీ పడతారు. కమ్మ సామాజిక వర్గం నుంచి రాయల నాగేశ్వరరావు పోటీ పడుతున్నారు. ఆయనతోపాటు గతంలో అనేకమార్లు పోటీ చేసిన సంభాని చంద్రశేఖర్ కూడా పాలేరు టిక్కెట్‌ను ఆశిస్తున్నారు. అయితే ఉన్న మూడు జనరల్ స్థానాల్లో రెండు సీట్లను మహా కూటమిలోని చెరో పార్టీ దక్కించుకుని అగ్రకులాలకు కేటాయిస్తున్నందున సామాజిక సమీకరణలో భాగంగా కాంగ్రెస్ పార్టీ పాలేరు టిక్కెట్‌ను బిసిలకు కేటాయించాలనే డిమాండ్ బిసిల నుంచి వస్తుంది.

ఇక్కడ బిసికి చెందిన ప్రముఖ హైకోర్టు న్యాయవాది ఈడ శేషగిరిరావు కాంగ్రెస్ టిక్కెట్ ఆశిస్తున్నారు. జనాభాలో అధిక శాతం ఉన్న బిసిలను స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి పార్టీలు మోసం చేస్తున్నాయని, బిసి సంఘాలు వాపోతున్నాయి. జనాభాలో అధిక శాతం ఉన్న బిసిలు ప్రతి నియోజకవర్గంలో ఓట్ల శాతం అధికంగా ఉన్నందున ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బిసిలకు ఒక సీటును కేటాయించాలని బిసి సంక్షేమ సంఘాలు, వివిధ రాజకీయ పక్షాలు డిమాండ్ కూడా చేస్తున్నాయి. ఖమ్మంలో గాయత్రి రవి లేదా కొత్తగూడెంలో వనమా వెంకటేశ్వరరావు, ఎడవల్లి కృష్ణ, పాలేరులో ఈడ శేషగిరిరావుల్లో ఒక్కరికి టిక్కెట్ ఇవ్వాలని బిసి సంఘాలు కోరుతున్నాయి.