Home తాజా వార్తలు ఆసీస్ తో చివరి రెండు టెస్టులకు భారత జట్టు ఎంపిక

ఆసీస్ తో చివరి రెండు టెస్టులకు భారత జట్టు ఎంపిక

 

న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్టు సిరీస్ లో భాగంగా చివరి రెండు టెస్టులకు భారత జట్టును బిసిసిఐ సెలక్షన్ కమిటీ ప్రకటించింది. యువ క్రికెటర్ పృథ్వీ షా గాయం నుంచి ఇంకా కోలుకోకపోవడంతో అతడికి విశ్రాంతినిచ్చారు. దీంతో పృథ్వీ షా సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. అతని స్థానంలో టీమ్‌లోకి దేశవాళీ క్రికెట్‌లో టాప్ ఫామ్‌లో ఉన్న మయాంక్ అగర్వాల్‌ను ఎంపిక చేశారు. మరోవైపు ఫిట్‌నెస్ ప్రూవ్ చేసుకున్న ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా కూడా మూడో టెస్ట్ తర్వాత జట్టుతో కలువనున్నట్లు తెలుస్తోంది.

ఇక, రెండో టెస్టులో భారత్ నాలుగో రోజు 112 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా సాగుతుంది. మూడో టెస్టు డిసెంబర్ 26న మెల్‌బోర్న్‌లో ప్రారంభం కాగా.. జనవరి 3న జరగనున్న నాలుగో టెస్టుకు సిడ్నీ ఆతిథ్యమిస్తోంది. నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తొలి టెస్టులో గెలిచిన కోహ్లీసేన 1-0తో ఆధిక్యంలో ఉన్న సంగతి తెలిసిందే.

ఇండియా టీమ్:

విరాట్ కోహ్లీ(కెప్టెన్), మురళీ విజయ్, కెఎల్ రాహుల్, పుజారా, రహానె(వైస్ కెప్టెన్), విహారి, రోహిత్ శర్మ, రిషబ్ పంత్, పార్థీవ్ పటేల్, అశ్విన్, జడేజా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్, బుమ్రా, భువనేశ్వర్ కుమార్, హార్దిక్ పాండ్య, మయాంక్ అగర్వాల్.

 

BCCI announces India Team for last two tests with Aus