Search
Wednesday 14 November 2018
  • :
  • :

భారీగా పెరిగిన టీమిండియా క్రికెటర్ల జీతాలు

Team-India

ముంబయి: భారత క్రికెటర్ల వార్షిక వేతనాలను బిసిసిఐ భారీగా పెంచింది. ప్రపంచంలోనే అత్యుత్తమ జీతాలు భారత క్రికెటర్లకు ఉండాలన్న ఉద్దేశంతో సుప్రీంకోర్టు నియమించిన పాలక కమిటీ… ఆటగాళ్ల జీతాలను భారీగా పెంచింది అని  బిసిసిఐ ఒక ప్రకటనలో పేర్కొంది. అంతేగాక కొత్త కాంట్రాక్టు వ్యవస్థను కూడా ప్రవేశపెట్టింది. ఈ కొత్త కాంట్రాక్టుల ప్రకారం…  ఏ ప్లస్ గ్రేడ్ క్రికెటర్లకు ఒక్కొక్కరికి రూ.7 కోట్లు, ఏ గ్రేడ్ క్రికెటర్లకు రూ.5 కోట్లు, బి గ్రేడ్ క్రికెటర్లకు రూ. 3 కోట్లు, సి గ్రేడ్ క్రికెటర్లకు రూ. కోటి ఇవ్వనున్నట్లు బిసిసిఐ ప్రకటించింది. అయితే ఈ కాంట్రాక్టుల్లో భారత మాజీ కెప్టెన్ ధోనీకి బిసిసిఐ షాక్ ఇచ్చింది. ధోనిని గ్రేడ్ ఏలో పెట్టింది. ఏ ప్లస్ కేటగిరీలో కెప్టెన్ విరాట్ కోహ్లీ, శిఖర్‌ధవన్, రోహిత్ శర్మ మాత్రమే ఉన్నారు. ఏ గ్రేడ్‌లో ధోనీ, అశ్వీన్, జడేజా, పుజారా, విజయ్, రహానె, సాహా ఉండగా, బి గ్రేడ్‌లో చాహాల్, కుల్దీప్ యాదవ్, ఉమేష్ యాదవ్, కెఎల్ రాహుల, ఇషాంత్ శర్మ, దినేష్ కార్తీక్ ఉన్నారు. కాంట్రాక్టు జాబితాలో ఈ ఏడాది 26 మంది ఆటగాళ్లకే బిసిసిఐ చోటు కల్పించింది. అలాగే మహిళా క్రికెటర్ల జీతాలు కూడా పెంచింది. ఏ గ్రేడ్ క్రికెటర్లకు  ఒక్కొక్కరికి రూ.50 లక్షలు, బి గ్రేడ్ వారికి రూ.30 లక్షలు, సి గ్రేడ్ వారికి రూ.10 లక్షలు ఇవ్వనున్నారు.

Comments

comments