Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

పంతం నెగ్గించుకున్న రవిశాస్త్రి

Team-India-Coach

ముంబయి: టీమిండియా కొత్త కోచ్‌గా ఎంపికైన రవిశాస్త్రి తన పంతం నెగ్గించుకున్నారు. బౌలింగ్ కోచ్‌గా జహీర్ ఖాన్‌ను కాదని తాను ప్రతిపాదించిన భరత్ అరుణ్‌నే తీసుకున్నాడు. అలాగే బ్యాటింగ్ కోచ్‌గా ద్రవిడ్‌ను పక్కనబెట్టి సంజయ్ బంగార్‌ను, ఫీల్డింగ్ కోచ్‌గా ఆర్ శ్రీధర్‌ను కొనసాగించాడు. రవిశాస్త్రి ఈ కొత్త టీమ్ భారత క్రికెట్ జట్టుకు 2019 వరల్డ్ కప్ వరకు తమ సేవలు అందించనుంది.

ఈ మేరకు బిసిసిఐ కార్యదర్శి అమితాబ్ చౌదరి వెల్లడించారు. దీంతో గత కొన్ని రోజులుగా బ్యాటింగ్, బౌలింగ్ కోచ్‌లపై కొనసాగుతున్న సస్పెన్స్‌కు తెరపడింది. మీడియాతో ర‌విశాస్త్రి మాట్లాడుతూ… ద్ర‌విడ్‌, జ‌హీర్ ఇద్ద‌రితోనూ వ్య‌క్తిగ‌తంగా మాట్లాడాన‌ని, వాళ్ల స‌ల‌హాలు, సూచ‌న‌లు త‌మ‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయ‌ని తెలిపాడు.

BCCI appoints Sanjay Bangar as Batting coach, Bharat Arun as the Bowling Coach.

BCCI appoints Sanjay Bangar as Batting coach, Bharat Arun as the Bowling Coach

Comments

comments