Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

ఆసీస్‌తో టెస్టు సిరీస్‌కు భారత జట్టు ఎంపిక

BCCI-2

ముంబయి: ఇప్పటికే వరుసగా ఆరు సిరీస్‌ల విజయంతో దూసుకెళ్తున్న టీమిండియా తన తదుపరి సిరీస్‌ను స్వదేశంలోనే ఆస్ట్రేలియాతో ఆడేందుకు సిద్ధమైంది. ఈ నెల 23 నుంచి నాల్గు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ప్రారంభం కానుంది. దీనిలో భాగంగా మొదటి రెండు టెస్టులకు గాను బిసిసిఐ ఇవాళ భారత జట్టును ఎంపిక చేసింది. దాదాపుగా బంగ్లాదేశ్‌తో ఆడిన జట్టునే కొనసాగించింది. 16 మంది సభ్యులతో కూడిన భారత జట్టు వివరాలు ఇలా ఉన్నాయి.
భారత జట్టు: విరాట్ కోహ్లి(కెప్టెన్), మురళీ విజయ్, లోకెష్ రాహుల్, అజింక్య రహానే, ఛటేశ్వర్ పుజారా, కరుణ్ నాయర్, వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అభినవ్ ముకుంద్, జయంత్ యాదవ్, కుల్దీప్, హార్దిక్ పాండ్యా, ఇషాంత్ శర్మ, భువనేశ్వర్ కుమార్, ఉమేష్ యాదవ్.

Comments

comments