Home జగిత్యాల ఆరు బయట నిద్ర… జర భద్రం

ఆరు బయట నిద్ర… జర భద్రం

  • వేసవిలో ఆరు బయట నిద్రిస్తున్నారా.. తస్మాత్ జాగ్రత్త
  • ప్రజల ఐక్యంతో చోరీల నియంత్రణ
  • అనుమానాస్పద వ్యక్తులపై సమాచారం ఇవ్వాలి
  • బెల్టు షాపులపై ప్రత్యేక దృష్టి
  • మద్యం మత్తు నిద్రలతో ఇక్కట్లు తప్పవు
  • గ్రామ యువకులు గస్తీలు ముమ్మరం చేయాలి
  • నగదు,బంగారం బ్యాంకుల్లో వేసుకోవాలి
  • గ్రామాల్లో సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి
  • ప్రజలకు ఎస్‌ఐ కృష్ణకుమార్ జాగ్రత్త సూచికలు

Robbery

కోరుట్ల : కోరుట్ల మండలం, పట్టణ ప్రజలకు వేసవి కాలంలో తీసుకోవలసిన జాగ్రత్త సూచికలు వెల్లడిస్తున్నారు ఎస్‌ఐ కృష్ణకుమార్. ఆరుబయట నిదురించే వారు విలువైన బంగారం,వెండిలతో పాటు భూమి కాగితాలు, నగదులను ఇంట్లో కాకుండా బ్యాంకుల్లో పెట్టుకోవడం శ్రేష్టమని, ముఖ్యంగా మహిళలు తమ బంగారు ఆభరణాలు వేసుకొని ఆరు బయట నిదురించే క్రమంలో దొంగలు దోచుకెళ్లే ప్రమాదం ఉందని,వృద్ద మహిళలు కూడా జాగ్రత్తలు పాటించాలని, గ్రామాల్లోని ప్రజలు అనుమానస్పదంగా కనిపించే వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండా లని దొంగలు బంగారం,నగదుల కోసం దాడిచేసైన అపహరించుకు పోతారని, తమ గ్రామంలో కొత్త వ్యక్తులు అనుమనంగా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సేవ చేయడానికి పోలీసు లు నిత్యం శ్రమిస్తుంటారని ఏమి జరగదనే నిర్లక్షధోరణిలు చూపకుండా కనీస జాగ్రత్తలు పాటించినట్లైతే దొంగతనాలను నియంత్రివచ్చని అన్నారు.
మద్యం మత్తు నిద్రలతో ఇక్కట్లు
మధ్యం సేవించే పల్లె జనాలు తమ ఆడ వారి పట్ల కనీస బాధ్యతలు మరువొద్దని అతిగా మద్యం సేవించి ఆ మత్తులో నిదురిస్తే జరగరానిదేదైన జరిగితే మీరు ఉన్నలేనట్లేగా. ముఖ్యంగా వ్యవసాయం చేసే మహిళ రైతులు పొద్దంత పంట పోలం పనుల్లో శ్రమించి ఇంటికి చేరుతారని భోజన అనంతరం శరీర అలసటతో నిదురిస్తే వారి జాగ్రత్తలు చూడల్సిం ది వారి కుటుంబ సభ్యులేగా. గ్రామ యువకులు గస్తీలు ముమ్మరం చేసి తమ గ్రామ ప్రజలను దొంగలబారి నుండి కాపాడుకోవాలని గ్రామ శివారులో నివసించే వారు ఒంటరిగా కాకుండా మరికొందరి తోడు చూసుకొని నిదురించడం ఎంతో మేలని తెలిపారు. ప్రతి గ్రామంలో గ్రామ పోలీసు (విపిఒ)ని నియమించామని విపిఓల సెల్ నంబర్లు ఇంట్లో రాసిపెట్టుకోవాలని అత్యవసర సయమంలో 100 కి సమాచరం ఇవ్వాల ని,గ్రామప్రజల ఐక్యంతో దొంగతనాలను నియంత్రింవచ్చని సూచిస్తున్నారు.
గ్రామాల్లో సిసి కెమెరాలు ఏర్పాట్లు చేసుకోవాలి
పట్టణాల్లో సిసి కెమెరాలను ఏర్పాటు చేయడంతో నేర పరిశోధన లకు అవి ఎంతో సహాయకంగా నిలుస్తున్నాయి. ఇటీవల కల్ల్లూర్ రోడ్ ఆనంద నగర్‌లో ద్విచక్ర వాహనంపై వెలుతున్న ఇద్దరు యువకులను డీ కొట్టిన కారు పరారు కాగా,అలాగే సెల్ షాపుల్లో దొంగతనం చేస్తున్న ఐదుగురు ముఠా సభ్యులను సిసి పూటేజ్ ఆధారంగానే పోలీసులు నిందితులను పట్టుకున్నారు. గ్రామాల్లోని ప్రధాన వీధుల్లో సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే గ్రామాల ప్రజలను దొంగల భారి నుండి కాపాడేందు కు సిసి కెమెరాలు ఎంతగా దోహదపడుతాయని వాటి కోసం సర్పంచ్ లు,గ్రామస్థులు అందరూ ముందుకువచ్చి దొంగల భరతం పట్టేందుకు పోలీసులకు సహకరించాలని కోరుతున్నారు.
బెల్టు షాపులపై ప్రత్యేక దృష్టి సారించిన ఎస్‌ఐ
గ్రామాల్లో బెల్టుషాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకోవండతో కేసులు నమేదు చేసి జైలు పంపుతామని జిల్లా ఎస్పి అనంతశర్మ సూచించిన నాటి నుండి మండలంలోని ప్రతి గ్రామంలో బెల్టుషాపుల నిర్వహణలపై ఎస్‌ఐ కృష్ణకుమార్ ప్రత్యేక దృష్టి సారించడంతో ఇంతకు ముందు రోజుల్లో మండలంలోని 17 గ్రామాల్లో సుమారు 60కి పైగా బెల్టుషాపులుండేవని ఇప్పుడు ఏ ఒక్క గ్రామల్లో ఒక్క కూడా బెల్టుషాపు లేకుండా చేయడంలో ఎస్‌ఐ రాత్రిపూట తనిఖీలే కారణమనే మాటలు వినిపిస్తున్నాయి, అలాగే రానున్న రోజుల్లో ఎవరైన గ్రామాల్లో మద్యం అమ్మకాలు చేసినట్టు తెలిస్తే వారి చట్టపరమైన చర్యలు తీసుకునే విధంగా ప్రజలు పోలీసులకు సహాకరించాలని. గతంలో లేని విధంగా రాత్రిపూట కూడా గ్రామాలను పరిశీలిస్తు బెల్టుషాపులను మూసేయించడంలో ఎస్‌ఐ కృష్ణకుమార్ విధుల నిర్వహణల పట్ల పల్లె మహిళలు హర్షం వ్యక్తం చేస్తు తమ కుటుంబ సభ్యులను మద్యం మత్తులో ప్రమాదాల బారి నుండి కాపాడుకునే విధంగా పోలీసులు బెల్టుషాపుల నిర్వహనలు నిలిపివే యాలనే నిర్ణయం సరియైందని గ్రామాల మహిళ సంఘాలు సైతం పోలీసులకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.