Home లైఫ్ స్టైల్ ఆదుకునే యాప్

ఆదుకునే యాప్

Safe-app

షాపింగ్, బయటకు ఒంటరిగా వెళ్లాల్సి వచ్చినప్పుడు కొద్దిగా భయంగా అనిపిస్తుంది. మనం ఇంటికి వచ్చేంత వరకూ మన ఇంట్లో వారికి  కూడా ఆందోళనే. అలాంటి సమయంలో ‘బీసేఫ్’ యాప్ వాడి చూడండి. అందులో ఉన్న సదుపాయాలు మనల్ని ఆపదసమయాల్లో రక్షిస్తాయి. ఫాలోమీ, టైమర్ అలారం, ఫేక్ కాల్, ట్రాక్‌మీ. చాలానే ఆప్షన్లు ఉంటాయి. దాంతో మనం ఎక్కడికైనా వెళ్లేముందు  యాప్‌లో మనం వివరాలు ఇచ్చిన వ్యక్తులకు నేరుగా ఈ సమాచారం వెళ్తుంది. మీరు ఎక్కడున్నా సరే జీపీఎస్ ద్వారా తెలిసిపోతుంది. దీంట్లో ఉన్న ఎస్‌ఓఎస్ మీట నొక్కితే వెంటనే వాళ్లందరికీ మీరు ఆపదలో ఉన్నట్లు సమాచారం అందించవచ్చు. సమస్య ఎదురుకావచ్చనే భయం మీలో ఉంటే ముందుగానే ఒక అలారం కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. ఒంటరిగా బయటకి వెళ్లే వారికి ఇది ఉపయోగకరమైన యాప్.