Home వార్తలు యోగం తెలిసిన ముద్దుగుమ్మలు!

యోగం తెలిసిన ముద్దుగుమ్మలు!

yoga-actressఅందమైన సినీ భామలు గ్లామరస్‌గా, నాజూగ్గా కనిపిం చేందుకు ప్రతిరోజు ఎక్సర్‌సైజులు చేస్తూ జిమ్‌లో కష్టపడుతుంటారు. స్లిమ్ముగా కనిపించి సినిమాల్లో మెరుపులు మెరిపించాలని ఈ భామలు తహతహలాడుతుంటారు. తమ శరీరాకృతిని ఆకర్షణీయంగా తీర్చిదిద్దుకునేందుకు అందాలతారలు యోగా కూడా చేస్తున్నారు. యోగాతో తమ బాడీని స్లిమ్ముగా చేసుకోవడమే కాదు మానసికోల్లాసాన్ని కూడా పొందుతున్నారు. ఇలా ‘యోగ’ం తెలిసిన యోగి నులైన బ్యూటీక్వీన్‌లు ఎందరో ఉన్నారు. వారిలో అనుష్క, కాజల్, తమన్నా, శ్రియా, లక్ష్మీప్రసన్న, రెజీనా, ఇలియా నా, శిల్పాశెట్టి, కంగనారనౌత్, బిపాసాబసు, మలైకా అరోరా, అమీషాపటేల్, తదితరులు ఉన్నారు.
యోగా నేడు ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాచుర్యం పొం దింది. ముఖ్యంగా పలువురు సినీతారలు, సెలబ్రిటీలు యోగాతో శారీరకంగా, మానసికంగా హుషారుగా ఉండగల్గుతున్నారు. సౌత్‌లో టాప్ బ్యూటీ అనుష్క సినిమాల్లోకి రాకముందు యోగా టీచర్‌గా చేసింది. ఈ భామ మాట్లాడుతూ “నా ఫిట్‌నెస్ రహస్యం యోగా. చదువు, ఆటలు ఎలాగో… యోగా కూడా అంతే. ముఖ్యంగా పిల్లలకు నేర్పించాలి. శరీరం, మనసు రెండింటినీ పరిశుద్ధంగా ఉంచేది యోగా”అని పేర్కొంది. ఈ భామ ఇటీవల ‘సైజ్ జీరో’ కోసం భారీగా బరువు పెరిగి అనం తరం 20 కిలోల బరువు తగ్గింది. యోగా చలవవల్లే అనుష్కకు ఇది సాధ్యపడిందట. “ఏ కష్టం లేకుండా ఒత్తిడిని తగ్గించుకునే అద్భుతం… యోగా. యోగా చేయడం వల్ల నేను రోజంతా ఉల్లాసంగా, ఉత్సాహంగా పనిచే యగల్గు తున్నాను” అని కాజల్ చెప్పింది. బాలీవుడ్‌లో యోగాతో విశేష ప్రాచుర్యం పొందిన సెలబ్రిటీ శిల్పాశెట్టి. ఈ భామ యోగాపై సిడిలు, డివిడిలను రిలీజ్ చేయగా అవి హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. ఈ బ్యూటీ మాట్లాడుతూ “మనదేశంలో కంటే విదేశాల్లోనే ఎక్కువ ఆదరణ పొందింది యోగ. జిమ్‌కంటే యోగాతోనే ఫలితం ఎక్కువ. నా యోగా డివిడిలు, సిడిలు ఎక్కువగా అమ్ముడవ్వడంతో నాకు సెలబ్రిటీగా మరింత పాపులారిటీ వచ్చింది” అని అంది. కోయంబత్తూర్‌లో జరిగిన యోగా సదస్సులో కిటుకులన్నీ తెలుసుకొని వాటిని తు.చ. తప్ప కుండా ఆచరించి ఫలితాన్ని అందుకుంటున్నానని శ్రియా చెప్పింది. బాలీవుడ్ తార అమీషాపటేల్ మాట్లాడుతూ “యోగా అంటేనే ఉల్లాసం, ఉత్సాహం. సినిమాల్లోకి రాకముందునుంచే యోగా అలవాటుంది నాకు”అని చెప్పింది. నాజూకుతనం, ఆరోగ్యం ఇవి రెండూ యోగా వల్లే సాధ్యమయ్యాయని ఇలియానా చెప్పింది. మనల్ని మనం మార్చుకునే శక్తి యోగా ఇస్తుందని లక్ష్మీప్రసన్న పేర్కొంది. ఇక తన అందం, ఆరోగ్య రహస్యం యోగా అని అందరికీ చెబుతానని తమన్నా అంది. బాలీవుడ్ హాట్ బ్యూటీ బిపాసాబసు ప్రతిరోజూ యోగా చేస్తుంది. ఈ భామ స్వయంగా యోగా సిడిలు, డివిడిలను రూపొందించి మార్కెట్లోకి విడుదల చేసింది. బిపాసాబసు మాట్లాడుతూ యోగా వల్ల నాజూగ్గా, హుషారుగా ఉండడమే కాదు ఎన్నో రకాల వ్యాధుల నుంచి దూరంగా ఉండవచ్చని పేర్కొంది. ఇలా భామలంతా అందరూ ప్రతిరోజూ యోగా చేయాలని