Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

మస్కారా మెళకువలు

7888కంటికి కాటుక అందంతో పాటు ఆధునిక యువతులు ఐషేడ్స్, మస్కారాలను కూడా బాగా ఉపయోగి స్తున్నారు. మస్కారా అంటే కనురెప్పల అందా న్ని పెంచేది. దీంతో దట్టమైన కనురెప్పల సొగసు కంటిపాపతో పోటీ పడుతున్నట్టుం టుంది. మీ కళ్ళు మరింత విశాలంగా అందంగా కనిపిస్తాయి. అయితే మస్కారా వేసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పనిస రిగా పాటించాలి.
* మార్కెట్లో దొరికే చౌకబారు మస్కారాలను వాడకూడదు. వీటిల్లో కెమికల్స్ ఉండడం వల్ల కంటికి హాని చేయడమే కాదు. కొన్ని మస్కారాలు ముద్ద ముద్దగా కనురెప్పలకు అంటుకుని రెప్పలు భారంగా అనిపిస్తాయి.
* మస్కారా వేసుకునే టప్పుడు రెప్పలు ఒకదానికి ఒకటి అంటుకుపోకుండా జాగ్రత్త పడాలి. లేదంటే రెప్పలు చెదిరిపోయి అసహ్యంగా కనిపిస్తాయి.
* మస్కారా బ్రష్‌ను పై నుంచి కాకుండా రెప్ప కిందవైపునుంచి పైకి వంపు తిప్పాలి. అప్పుడు రెప్పలు కనుబొమల వైపు విల్లులా వంగినట్టు కనిపిస్తాయి.
* కనురెప్పల మొదటి నుంచి బ్రష్‌ను పట్టుకున్నప్పుడు బ్రష్ కళ్ళకు గుచ్చుకోకుండా జాగ్రత్త పడండి.

Comments

comments