Home సినిమా కంగన అందాలే ప్రత్యేక ఆకర్షణ

కంగన అందాలే ప్రత్యేక ఆకర్షణ

kanganaబాలీవుడ్‌లో ఇప్పుడు ‘రంగూన్’ మూవీ హల్‌చల్ చేస్తోంది. ఇందుకు కారణం  సినిమాలో బ్యూటీ‘క్వీన్’ కంగనా రనౌత్ అందచందాలే. ట్రైలర్‌లో ఈ అమ్మడి గ్లామర్ డోస్ యూత్‌ను అలరిస్తోంది.  ట్రైలర్ చూస్తే ట్రయాంగిల్ లవ్ స్టోరీ అన్నట్లుగా ఉంది కానీ… థీమ్ అర్థం కాకుండా జాగ్రత్తపడ్డారు ఫిల్మ్‌మేకర్స్. అటు షాహిద్ కపూర్… ఇటు సైఫ్‌అలీఖాన్ ఇద్దరితోనూ కంగనా రొమాన్స్ చేసేస్తోంది. సినిమాలో ఈ హాట్ భామ టాప్‌లెస్‌గా నటించిందనే టాక్ వినిపించింది. అయితే ఇందుకోసం డూప్‌ను ఉపయోగించారటగా అని అంటే… నాకు డూప్స్ అవసరం లేదని చెప్పింది కంగన. సినిమా అంతా తానే నటించానని అంటూ టాప్‌లెస్ గురించి మాత్రం ఏ మాటా మాట్లాడడం లేదు. ఈ పీరియాడికల్ మూవీలో కంగన అందాలే ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయట. ఫిబ్రవరి 24న విడుదలకానున్న ఈ చిత్రంపై బాలీవుడ్‌లో అంచనాలు భారీగానే ఉన్నాయి.