Home తాజా వార్తలు జిఓ 41తో పలు సంక్షేమ ఫలాలు

జిఓ 41తో పలు సంక్షేమ ఫలాలు

Beedi workers for GO number 41

మనతెలంగాణ/ నిజామాబాద్ : జిఓ నంబర్ 41 కొరకు బీడి కార్మికులు, కార్మిక సంఘ నాయకులు అలుపెరగని పోరాటం చేసి సాధించుకున్నారు. ఈ జిఓ అమలైతే బీడి కార్మికులు, బీడి కంపెనీలపై ఆధారపడి జీవిస్తున్న కార్మికులకు ఎన్నో సంక్షేమ ఫలాలు అందుతా యి. బీడి తయారీ దారులకు ఆర్థిక భారం కూడా పడుతుంది. అందుకు పాలకులను మచ్చిక చేసుకొని కొత్తగా అభయేన్స్ 81జిఓను బీడి తయారిదారులు తెరపైకి వచ్చే విధంగా కీలక పాత్ర పోషించారు. దీంతో 41 జిఓ అందని ద్రాక్షల మారింది. బీడి తయారి దారులు మా త్రం యధేచ్చగా లాభాలు పోందుతున్నారు. కార్మికులు మాత్రం నష్టపోతున్నారు.
జిఓ అమలైతే పలు సంక్షేమాలు
2010 నవంబర్‌లో బీడి కార్మికులు వేతనాల పెంపు కోరుతూ బీడిల తయారీ బంద్ చేసి 32 రోజుల పాటు నిరవధిక సమ్మె చేసి అప్పటి సర్కార్ మెడలు వంచి 1000 బీడిలకు కనీస వేతనం రూ.130గా నిర్ణయిస్తూ జిఓ 41ని సాధించుకున్నారు. ఆ జిఓ అమలుకు ఒప్పుకోక కరువు భత్యం, బోనస్ కలుపుకొని వెయ్యి బీడిలకు కార్మికులకు రూ.158 అందేలా వేతన పెంపు జిఓ అమలుపై యజమాన్యాలు మోండికేయడంతో సమ్మె కాలంలో కార్మికుల చేతిలో డబ్బులు లేక నానా ఇబ్బందులు ప డ్డారు. కార్మిక సంఘాల నాయకులతో చర్చలు జరిపి మ ధ్యే మార్గంగా వెయ్యి బీడిలకు మూల వేతనం రూ.100 చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందా న్ని కొన్ని కార్మిక సంఘాలు వ్యతిరేకించాయి.

జిఓ 41 కాదని కొత్తగా అభయేన్స్ 81జిఓ జారీ అయ్యింది. దీని ప్రకారం ప్రస్తుతం బీడి కార్మికులకు వెయ్యి బీడిలకు రూ.145 మాత్రమే అందుతున్నాయి. దీంట్లో రూ.45 కరువు భత్యం, బోనస్‌కు చెందినవే కావడం గమనార్హం. జిఓ 41ని అమలులోకి తేవాలని ఇప్పటికి బీడి కార్మికు లు, కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేస్తునే ఉ న్నారు. ఈ జిఓ అమలైతే బీడి కార్మికులతోపాటు బీడి కంపెనీలపై ఆధారపడి జీవిస్తున్న అన్ని రకాల కార్మికులకు ఎంతో మేలు జరుగడంతోపాటు పలు సంక్షేమ పథకాలు అందుతాయి. కాని బీడి కార్మికుల వేతనాల పెం పు అంశంలో యాజమాన్యాలు అడిందే ఆట, పాడిందే పాటగా సాగుతుంది. గుజరాత్, మహారాష్ట్ర ప్రాంతాలకు చెందిన ప్రధాన బీడి కంపెనీలపై సర్కారి యజమాహిషీ అంతంత్ర మాత్రమే కావడంతో కార్మికుల తీవ్ర అన్యాయం జరుగుతుంది.
చేతి నిండా దొరకని పని
జిల్లా కేంద్రంతోపాటు ఆర్మూర్, బోధన్ నియోజకవర్గంలో , కామారెడ్డి జిల్లాలో కామారెడ్డితో పాటు బాన్సువాడ నియోజకవర్గాలలో వేల మంది బీడి కార్మికులు ఉంటారు. రోజు రోజుకు బీడిలకు డిమాండ్ తగ్గి పోతుండగా, బీడి కంపెనీల యాజమాన్యాలు బీడిల తయారికి ముందుకు రావడం లేదు. దీనికి ఫలితంగా బీడి అవసరాలకు అనుగుణంగా నెలకు సరిపడే ఆకు తంబాకు ఇవ్వడంలో కూడా బీడి కంపెనీలు మీనమేశాలు లెక్కిస్తుండడంతో ఒక నెలలో 10 నుండి 15 రోజుల మాత్ర మే పని దొరుకుతుంది. చట్టాల ప్రకారం కనీసం యేడాదికి 312 రోజులు పని కల్పించాలి. కాని వంద నుండి 125 రోజులు మాత్రమే పని కల్పింస్తున్నారు. యాజమాన్యాలు ఇష్టా రీతిన వ్యవహరించడంతో బీడి కార్మికులు సమస్యలు ఎదుర్కుంటున్నారు. ములిగే నక్కపై తాటికాయ పడ్డట్లు వర్ధి బీడి కంపెనీలు(అనాధికారికంగా) పెరిగిపోడంతో బీడిలు చుడుతూ జీవనం సాగించే కార్మికులు తీవ్రంగా నష్టపోవడంతో పాటు తప్పని పరిస్థితుల్లో తక్కువ కూలీకి వర్ధి బీడిలు చేసి పొట్ట నింపుకుంటున్నారు. ప్రభుత్వం స్పందించి జిఓ 41 అమలు చేస్తే బీడి కార్మికుల బతుకుల్లో వెలుగులు నిండుతాయి.

Beedi workers for GO number 41

Telangana News