రాజన్న సిరిసిల్ల : కోనరావుపేటో ఉపాధి కూలీలపై శుక్రవారం ఉదయం తేనెటీగలు దాడి చేశాయి. నాగంపేట అటవీ ప్రాంతంలో వారు పని చేస్తున్న సమయంలో తేనెటీగలు దాడి చేశాయి. తేనెటీగల దాడిలో 9మంది కూలీలు గాయపడ్డారు. గాయపడిన వారిని కోనరావుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స చేశారు. ముగ్గురు తీవ్రంగా గాయపడడంతో మెరుగైన వైద్యం కోసం జిల్లా కేంద్రం ఆస్పత్రికి తరలించారు.