Home జాతీయ వార్తలు భిక్షాటన నేరం కాదు!

భిక్షాటన నేరం కాదు!

Begging decriminalised by delhi high court

న్యూఢిల్లీ:  దేశ రాజధాని ఢిల్లీలో అడుక్కోవడం నేరమని, అలాంటి వాళ్లపై చర్యలు తీసుకునే అధికారం అధికారులకు ఇవ్వడం పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని అక్కడి హైకోర్టు తేల్చి చెప్పింది. అడుక్కోవడం నేరమని చెబుతూ ఢిల్లీ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టంలోని నిబంధనలు రాజ్యాంగ విరుద్ధమని తెల్చింది. అంతేకాదు అవి కొట్టేయదగినవేనని కోర్టు బుధవారం స్పష్టంచేసింది. ఈ అంశంలో సామాజిక, ఆర్థిక కోణాలను క్షుణ్నంగా పరిశీలించాలని తెలియజేశింది. బలవంతపు భిక్షాటనను అరికట్టడానికి ఢిల్లీ సర్కార్ కొత్త చట్టం తీసుకురావచ్చని హైకోర్టు తన తీర్పులో వెల్లడించింది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి గీతా మిట్టల్, జస్టిస్ హరిశంకర్ ఆధ్వర్యంలో ధర్మాసనం దీనిపై విచారణ చేపట్టింది. ప్రజల కనీస అవసరాలైన ఆహారం, ఉద్యోగాలు కల్పించలేని స్థితుల్లో ప్రభుత్వాలు ఉన్న దేశంలో అడుక్కోవడం ఎలా నేరం అవుతుందని గతంలోనే హైకోర్టు ప్రశ్నించిన సంగతి తెలిసిందే. భిక్షాటన నేరం కాదంటూ దాఖలైన రెండు పిటిషన్లపై హైకోర్టు విచారణ చేపట్టింది.